విధాత : టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పరామర్శించారు. జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ బాబును పరామర్శించి ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు శనివారం ఉదయం కూడా ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కంటీ పరీక్షలు చేయించకున్నారు. రెండు రోజుల్లో బాబు కంటీ ఆపరేషన్ చేయించుకుంటారని సమాచారం. కాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీలో ఉమ్మడిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చిస్తున్నట్లు సమాచారం.