Site icon vidhaatha

రాజ‌కీయాల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌గిన‌వాడు.. చిరంజీవి ప్ర‌శంస‌లు

విధాత: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప‌వ‌న్ రాజ‌కీయాల‌కు త‌గిన‌వాడు.. ఏదో ఒక రోజు క‌ల్యాణ్‌ను ఉన్న‌త‌ స్థాయిలో చూస్తామ‌ని చిరంజీవి స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్వ‌హించిన వైఎన్ఎం క‌ళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ స‌మ్మేళ‌నానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాజ‌కీయాల్లో రాణించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని పేర్కొన్నారు. రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు చాలా మొర‌టుగా, క‌టువుగా ఉండాలి. రాజ‌కీయాల్లో మాట‌లు అన్నా అన‌క‌పోయినా అనిపించుకోవాలి, అనాలి అని చిరు పేర్కొన్నారు. ఒక ద‌శ‌లో త‌న‌కు రాజ‌కీయాలు అవ‌స‌ర‌మా అనిపించింది అని చిరంజీవి పేర్కొన్నారు.

Exit mobile version