Site icon vidhaatha

రాడిసన్ డ్రగ్ కేసులో పురోగతి.. పెడ్లర్ రెహమాన్ అరెస్టు

విధాత, హైదరాబాద్ : రాడిసన్ డ్రగ్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పరారీలో ఉన్న డ్రగ్ పెడ్లర్‌ రెహమాన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని గచ్చిబౌలీ పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. గజ్జల వివేకానం రాడిసన్ హోటల్‌లో డ్రగ్ పార్టీ నిర్వహించారు. డ్రగ్ పార్టీలో సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే టాలీవుడ్ డైరక్టర్ క్రిష్ ను సైతం విచారించారు. కేసులో పలువురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు, విదేశాలకు పారిపోయిన మరో ఇద్దరికి నోటీస్‌లు జారీ చేశారు.

రాడిసన్ డ్రగ్ కేసులో టాలీవుడ్ డైరక్టర్ క్రిష్ నుంచి పోలీసులు సేకరించిన యూరిన్ శాంపిల్స్‌లో ఆయన డ్రగ్ తీసుకోలేనట్లుగా తేలింది. ఇక రక్త పరీక్షల నివేదిక రావాల్సివుంది. ఈ కేసులో ఇప్పటి వరకు 13మందిపై కేసు నమోదు చేశారు. హోటల్ మేనేజర్‌పై కూడా కొత్తగా కేసు నమోదు చేశారు. ఇక డైరక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది.

Exit mobile version