విధాత: రాష్ట్ర గవర్నర్ (Governor Tamilisai) తమిళిసై సౌందర్ రాజన్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 10 బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచడంతో.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సెప్టెంబర్ నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులను ఆమోదించకపోవడంపై తెలంగాణ సర్కార్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా తమిళిసై సౌందర్ రాజన్ పేరును చేర్చారు. బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
పెండింగ్‌లో ఉన్న బిల్లులు..
- వ్యవసాయ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు
- తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు
- ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీ అప్గ్రేడ్ బిల్లు
- అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు
- పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లు
- పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు
- మున్సిపల్ చట్ట సవరణ బిల్లు
- మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు
- ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు
- అగ్రికల్చర్ యూనివర్సిటీ బిల్లు