Governor Tamilisai | పెండింగ్‌లో బిల్లులు.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పై.. సుప్రీంలో తెలంగాణ ప్ర‌భుత్వం పిటిష‌న్

విధాత: రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ (Governor Tamilisai) త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ వ్య‌వ‌హారంపై తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు వేసింది. 10 బిల్లుల‌ను ఆమోదించ‌కుండా పెండింగ్‌లో ఉంచ‌డంతో.. రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. సెప్టెంబ‌ర్ నుంచి 7 బిల్లులు, గ‌త నెల నుంచి 3 బిల్లులను ఆమోదించ‌క‌పోవ‌డంపై తెలంగాణ స‌ర్కార్ చీఫ్ సెక్ర‌ట‌రీ శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌లో ప్ర‌తివాదిగా త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పేరును చేర్చారు. బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించేలా […]

  • By: krs    latest    Mar 02, 2023 11:02 AM IST
Governor Tamilisai | పెండింగ్‌లో బిల్లులు.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పై.. సుప్రీంలో తెలంగాణ ప్ర‌భుత్వం పిటిష‌న్

విధాత: రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ (Governor Tamilisai) త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ వ్య‌వ‌హారంపై తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు వేసింది. 10 బిల్లుల‌ను ఆమోదించ‌కుండా పెండింగ్‌లో ఉంచ‌డంతో.. రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

సెప్టెంబ‌ర్ నుంచి 7 బిల్లులు, గ‌త నెల నుంచి 3 బిల్లులను ఆమోదించ‌క‌పోవ‌డంపై తెలంగాణ స‌ర్కార్ చీఫ్ సెక్ర‌ట‌రీ శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ పిటిష‌న్‌లో ప్ర‌తివాదిగా త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పేరును చేర్చారు. బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ రేపు విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

పెండింగ్‌లో ఉన్న బిల్లులు..

  • వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌య స‌వ‌ర‌ణ బిల్లు
  • తెలంగాణ విశ్వ‌విద్యాల‌యాల ఉమ్మ‌డి నియామ‌క బోర్డు బిల్లు
  • ములుగులో అట‌వీ కళాశాల‌, ప‌రిశోధ‌నా సంస్థ‌ను అట‌వీ వ‌ర్సిటీ అప్‌గ్రేడ్ బిల్లు
  • అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
  • ప‌బ్లిక్ ఎంప్లాయిమెంట్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
  • పంచాయ‌తీరాజ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
  • మున్సిప‌ల్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
  • మోటార్ వెహిక‌ల్ టాక్సేష‌న్ స‌వ‌ర‌ణ బిల్లు
  • ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు
  • అగ్రికల్చర్ యూనివర్సిటీ బిల్లు