Site icon vidhaatha

మెగాస్టార్‌కు ప్రధాని మోడీ అభినందనలు

విధాత: సినీ పరిశ్రమకు అందించిన విశేష సేవలకు గాను తెలుగు చలన చిత్ర నటుడు చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ -2022 అవార్డును కేంద్రప్రభుత్వం ఆదివారం ప్రకటించిన విషయం ప్రజలకు తెలిసిందే.

ఈ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవికి ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. చిరంజీవి విలక్షణమైన నటుడు. అనేక పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానం, ఆదరణ చూరగొన్నారు. అని మోడీ ట్విటర్‌ ద్వారా చిరుకు అభినందనలు చెప్పారు.

గోవా రాష్ట్ర రాజధాని పనాజిలో ఆదివారం ప్రారంభమైన ఇఫి వేడుకలు 29 వరకు కొనసాగనున్నాయి. మంచి కంటెంట్‌తో తెరకెక్కిన పలు చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాగే సినీ పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు.

Exit mobile version