విధాత : ఎంఐఎం ఎమ్మెల్యే, చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్ధిన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచార సమయం ముగిసిపోతుందని, ప్రచారం ముగించాలని సూచించిన సంతోష్ నగర్ ఇనస్పెక్టర్‌ను అక్బరుద్ధిన్ బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేశారు.
ఐపీసీ 353 సహా వివిధ సెక్షన్ల కింద సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్బరుద్ధిన్ బెదిరింపుల వీడియో వైరల్‌గామారడంతో ఎన్నికల సంఘం, పోలీసులు సీరియస్‌గా తీసుకుని ఆయనపై చట్టపర చర్యలకు ఉపక్రమించింది.