విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కాన్వాయ్‌ని శుక్రవారం సూర్యాపేట సమీపంలోని విజయవాడ -హైదరబాద్ జాతీయ రహదారిపై చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి జగదీశ్ రెడ్డి పూర్తిగా సహకరించారు.
మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు తనిఖీ చేశారు. కారులోని డాష్ బోర్డ్ లను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసి డబ్బు ఉందా? అంటూ ఆరా తీశారు. తమ వాహనం మొత్తం వెంట ఉండి మరీ పోలీసులకు చూపించారు. వాహన తనిఖీ అనంతరం మంత్రికి అధికారులు ధన్యవాదాలు తెలిపారు.