Breaking: ష‌ర్మిలతో పొంగులేటి రహస్య భేటీ?

విధాత‌: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ షర్మిలతో భేటీ అయ్యారు. ఆయన కొంతకాలంగా బీఆర్‌ఎస్‌పై అసంతృప్తిగా ఉంటూ.. ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలో లేదా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్నది. అలాగే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు ఖమ్మం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్న ఆయన […]

  • Publish Date - January 24, 2023 / 11:21 AM IST

విధాత‌: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ షర్మిలతో భేటీ అయ్యారు. ఆయన కొంతకాలంగా బీఆర్‌ఎస్‌పై అసంతృప్తిగా ఉంటూ.. ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఆయన బీజేపీలో లేదా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్నది. అలాగే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు

ఖమ్మం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్న ఆయన అధికార పార్టీపై నేతల పేర్లు నేరుగా చెప్పకుండా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలతో పొంగులేటి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.