Site icon vidhaatha

Prabhas | ఒకటి తలిస్తే మరోటి! ప్రభాస్ వద్దనుకుంటే.. ఇప్పుడు రికార్డులు బద్దలవుతున్నాయ్

Prabhas |

బాహుబలి తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ రేంజ్ అతనికి వచ్చిన పేరులాగే భారీ స్థాయికి చేరింది. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలకు దాదాపు సినిమాకు 100 కోట్లు తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే థియేట్రికల్ ఒప్పందాల విషయంలోనూ చాలా చురుగ్గానే ఉంటున్నాడు.

అదే సందర్భంలో తన ‘ఆదిపురుష్’ మూవీకి సంబంధించి యువి క్రియేషన్స్ ముందుండి నడిపించాడు ప్రభాస్. ఇది ప్రభాస్ కజిన్ ప్రమోద్‌కు చెందిన సంస్థ కావడం, అనుకున్నంత వ్యాపారం జరగక ఆ ఎఫెక్ట్ యువి క్రియేషన్స్ మీద పడటంతో ప్రభాస్ కాస్త ఆలోచనలో పడ్డాడట. అందుకే త్వరలో రాబోతున్న తన ‘సలార్’ సినిమా విషయంలో కాస్త సైలెంట్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు.

Megastar Chiranjeevi | స్వ‌యంకృషి నుంచి.. స్వ‌యంకృతాప‌రాధం దాకా!

ఆదిపురుష్ మూవీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. అలాగే వ్యాపారం పరంగా కూడా పెద్దగా తెచ్చి పెట్టిన లాభాలు కూడా ఏం లేవు. అప్పుడు జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదని ప్రభాస్ అనుకున్నట్లు న్నాడు. ‘సలార్’ విషయంలో కామ్ అయిపోయాడు.

అయితే ‘సలార్’ బిజినెస్ మాత్రం చాలా చురుగ్గా జరుగుతుంది. ఈ మూవీ పాన్ ఇండియన్ మూవీగా వస్తుంది. దానికి తగినట్టుగానే బిజినెస్ కూడా జరుగుతుందట. అయితే ప్రభాస్ మాత్రం గత సినిమా ఆదిపురుష్ ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వ్యాపార లావాదేవీల్లోనూ కలగజేసుకోవడం లేదట.

Tamannah | త‌మ‌న్నా ప్రైవేట్ పార్ట్స్‌పై దారుణ‌మైన కామెంట్.. ధైర్యం కోల్పోయానన్న మిల్కీ బ్యూటీ

సలార్ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కు చాలా పెద్ద మొత్తమే పలికినట్టు భోగట్టా. అలాగే సలార్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. దాదాపు 200 కోట్లతో దక్షిణాదితో పాటు హిందీ రైట్స్ కూడా సొంతం చేసుకుంది.

ఈ మూవీ హక్కుల కోసం గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ రెండు సంస్థలూ పోటా పోటీ పడటంతో ధర ఒక్కసారే ఎక్కువగా పలికినట్టుగా కనిపిస్తుంది. తెలుగు థియేట్రికల్ హక్కులతో ప్రభాస్.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నాడనేలా టాక్ వినబడుతుండటంతో.. అది మా ప్రభాస్ రేంజ్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు.

హోంబలే ఫిల్మ్స్ పతాకంపై వస్తున్న సలార్ మూవీలో ప్రభాస్‌కి జంటగా శృతిహాసన్ నటిస్తుంది. ఇందులో శృతి జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రానుంది.

ఇక రవి బస్రూర్ సంగీతంతో పాటు సీనియర్ నటులు జగపతిబాబు, మలయాళ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ రెండు పార్ట్స్‌గా రానుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా సలార్ పార్ట్ 1 రాబోతోంది. భారీ అంచనాలతో విడుదలకు ముస్తాబవుతోన్న ‘సలార్’పై ఓ రేంజ్‌లో ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుని ఉన్నారు.

Nani | దుల్హర్‌.. ఒక్కడే పాన్‌ ఇండియా స్టార్‌: నాని! లేని పోని చిక్కులో పడ్డ న్యాచురల్‌ స్టార్‌

Pawan Kalyan: వరుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి పెళ్లికి మ‌రో పెద్ద ట్విస్ట్‌.. నిహారిక‌, ప‌వ‌న్ దూరం..!

Exit mobile version