విధాత: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటు గతంలో జరిగిన హుజుర్ నగర్, నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజానీకానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
నవంబర్ 3న నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టం కట్టి కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజానీకానికి పార్టీ తరఫున ధన్యవాదాలు. ఈ గెలుపులో భాగంగా వేలాదిగా పనిచేసిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్‌కు, 40 రోజులుగా పార్టీ అభ్యర్థికి కోసం గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండుకి శిరస్సు వహించి.. పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు.
పైనున్నోడు ఫేకుడు.. కిందున్నోడు జోకుడు: BJPపై కేటీఆర్ నిప్పులు
టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు చాలా గొప్పగా పని చేసి, తమ కార్యకర్తలు, శ్రేణులను అద్భుతంగా నడిపించిన కీలకపాత్ర పోషించిన సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు కూనంనేటి సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, పల్లా వెంకట్‌రెడ్డి, జాలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, యాదగిరి రావుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన మూడు ఉప ఎన్నికల్లో హుజూర్‌నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులను నల్లగొండ గడ్డపై మొట్టమొదటి సారిగా 12 స్థానాలకు 12 స్థానాలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టినందుకు, కొత్త చరిత్ర లిఖించినందుకు నల్లగొండ జిల్లా ప్రజానీకానికి, చైతన్యానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం.
Live: TRS Working President, Minister Sri @KTRTRS addressing the Media at Telangana Bhavan#MunugodeWithTRS https://t.co/t0v8gcDi4f
— TRS Party (@trspartyonline) November 6, 2022
రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలుంటాయని పెద్దలు ఎప్పుడో చెప్పారని, ఈ ఉప ఎన్నికల్లో అదే జరిగింది. అహంకారం, డప్పు మదం, రాజకీయ కళ్లునెత్తికెక్కి, పొరుగుతో బలవంతుపు ఉప ఎన్నిక ఉప ఎన్నికను తెలంగాణ, మునుగోడు ప్రజలపై రుద్దింది ఢిల్లీ బాస్‌లు నరేంద్ర మోదీ, అమిత్‌షా. ఇద్దరి అహంకారానికి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి ధన్యవాదాలు.
మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగుర వేసినందుకు సంతోషపడుతున్నం. రుద్దిన ఎన్నికను.. రుద్దిన వారికే మీరు గుద్దిన గుద్దుడుకు చెక్కరొచ్చింది. ఎన్నికల్లో ఇక్కడ కనిపించిన మొఖం భారతీయ జనతా పార్టీ నుంచి రాజగోపాల్‌రెడ్డిదే కావొచ్చు. వెనుకుండి నాటకం మొత్తం నడిపింది అమిత్ షా, నరేంద్ర మోదీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు అని కేటీఆర్ పేర్కొన్నారు.