యాత్రకు బ్రేక్‌.. రేపటి నుంచి గుజరాత్‌లో రాహుల్‌ ప్రచారం

విధాత: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతున్నది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌లో ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలు అక్కడ బీజేపీని ఏడోసారి అధికారంలోకి తీసుకుని రావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అలాగే ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా గుజరాత్‌లోనే మకాం వేసి తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కానీ గుజరాత్‌లో గత వైభవాన్ని తిరిగి పొందాలనుకుంటున్న కాంగ్రెస్‌ […]

  • Publish Date - November 20, 2022 / 02:54 AM IST

విధాత: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ దగ్గరపడుతున్నది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌లో ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలు అక్కడ బీజేపీని ఏడోసారి అధికారంలోకి తీసుకుని రావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

అలాగే ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా గుజరాత్‌లోనే మకాం వేసి తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కానీ గుజరాత్‌లో గత వైభవాన్ని తిరిగి పొందాలనుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా గుజరాత్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భగేల్‌ మరికొంతమంది జాతీయ నేతలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు.

ఇటీవల ప్రకటించిన గుజరాత్‌ స్టార్‌ క్యాంపెయినర్‌లో జాబితాలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఉన్నారు. అయినప్పటికీ భారత్‌ జోడో యాత్రలో ఉన్న రాహులు ప్రచారానికి ఇప్పటివరకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ గుజరాత్‌లో ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచారం దృష్ట్యా జోడో యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఈ నెల 21న సూరత్‌, రాజ్‌కోట్‌ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.

Latest News