పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచండి.. ఆయకట్ట రైతుల డిమాండ్

త్వరలో లక్ష్య సాధనకు కార్యాచరణ విధాత, నిజామాబాద్‌: కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఇంట్లో మంగళవారం ఆయకట్ట రైతులు సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల్లోని పలు గ్రామాలకు తాగు, సాగు నీరు అందుతోంది. కాగా సమావేశం సందర్భంగా ఆయకట్టు రైతులు మాట్లాడుతూ పోచారం ప్రాజెక్టు ఎత్తు అయిదడుగులు పెంచాలన్నారు. […]

  • Publish Date - December 14, 2022 / 01:35 AM IST

త్వరలో లక్ష్య సాధనకు కార్యాచరణ

విధాత, నిజామాబాద్‌: కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఇంట్లో మంగళవారం ఆయకట్ట రైతులు సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల్లోని పలు గ్రామాలకు తాగు, సాగు నీరు అందుతోంది.

కాగా సమావేశం సందర్భంగా ఆయకట్టు రైతులు మాట్లాడుతూ పోచారం ప్రాజెక్టు ఎత్తు అయిదడుగులు పెంచాలన్నారు. ప్రతి ఏటా పోచారం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం నిండుతున్నా చివరి ఆయకట్టు వరకు నిరందడం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా చివరి ఆయకట్టు రైతులైన అన్నసాగర్ గ్రామ రైతులు మాట్లాడుతూ ప్రతిసారి పోచారం నిండుకుండలా నిండుతున్నప్పటికీ తమకు చుక్క నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా దాదాపు అన్ని గ్రామాల రైతులు గతంలో పోచారం ఎత్తు పెంపు కోసం చేసిన పాదయాత్రలో నాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే జాజాల సురేందర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి టిఆర్ఎస్ లోకి పార్టీ పిరాయించారాని, ఆ తర్వాత ప్రాజెక్టు ఎత్తు పెంపు గురించి గాని ఆయకట్టు రైతుల గురించి గాని పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

తొందరలోనే పోచారం ఎత్తు పెంపు విషయమై కీలకమైన అంశాలతో నిర్ణయం తీసుకుంటామని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పోచారం ఎత్తు పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎత్తు పెంచాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. లేనిచో తాము ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.