డ్రైనేజీలోకి దూసుకెళ్లిన‌ రాజ‌స్థాన్ సీఎం కారు

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కారు మంగళవారం రాత్రి రోడ్డు పక్కన ఉన్నడ్రైనేజీ కాలువ‌లోకి దూసుకెళ్లింది

  • Publish Date - December 20, 2023 / 07:06 AM IST
  • మధురలోని గిరిరాజ్ ఆలయానికి వెళ్తుండ‌గా ప్ర‌మాదం
  • మ‌రో కారులో వెళ్లిపోయిన భజన్ లాల్ శర్మ దంప‌తులు


విధాత‌: రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కారు మంగళవారం రాత్రి రోడ్డు పక్కన ఉన్నడ్రైనేజీ కాలువ‌లోకి దూసుకెళ్లింది. ముఖ్యమంత్రి ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్నారని, దాని ముందున్న ఎడమ టైరు కాలువలో దిగ‌బ‌డింద‌ని భరత్‌పూర్ ఎస్పీ మృదుల్ కచ్చవా తెలిపారు.


రాజస్థాన్-ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని భరత్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింద‌ని పేర్కొన్నారు. సీఎం శర్మ త‌న స‌తీమ‌ణితో క‌లిసి మధురలోని గిరిరాజ్ ఆలయానికి వెళ్తుండ‌గా, పంచారి కే లోథా దేవాలయం సమీపంలో కారు కాలువలోకి దిగింద‌ని చెప్పారు. కారు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ముఖ్య‌మంత్రి దంప‌తుల‌ను మరో వాహనంలో తరలించినట్టు ఎస్పీ తెలిపారు. మరో కారులో సురక్షితంగా మధుర చేరుకున్నారని ఎస్పీ వెల్ల‌డించారు