Ram Charan | రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రం షూటింగ్‌కు బ్రేక్‌పడింది. సెప్టెంబర్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అయిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పలువురు నటీనటులు అందుబాటులో లేకపోవడంతో షూటింగ్‌ను వాయిదా వేశామని, అక్టోబర్ రెండోవారం నుంచి తిరిగి షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది.
అయితే, షూటింగ్ వాయిదా అసలు కారణం నటీనటులు అందుబాటులో లేకపోవడం కాదని సమాచారం. రెండురోజుల కిందట జరిగిన ప్రమాదంలో హీరో రామ్‌చరణ్ ముఖానికి దెబ్బతగిలింది. గాయం చిన్నదే అయినా పదిరోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని, ఈ క్రమంలోనే ఆదివారం నుంచి మొదలవ్వాల్సిన గేమ్‌ఛేంజర్ షెడ్యూల్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. గాయం నుంచి రామ్‌చరణ్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆక్టోబర్ 6 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్‌ను మొదలు పెట్టనున్నారు.
కేజీఎఫ్ ఫేమ్ అన్భు అరివు సారథ్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న గేమ్ ఛేంజర్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూ.200కోట్లకుపైగా బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్, అంజలి, ఎస్‌జే సూర్యతో పాటు పలువురు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిసున్నారు.