రామాయంపేట మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డి కన్నుమూత

రామాయంపేట మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డి కన్నుమూత

పలువురి సంతాపం

విధాత: మెదక్ బ్యూరో: రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి వాసు రెడ్డి ( శ్రీనివాస్ రెడ్డి) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య పద్మా , కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి, కుమార్తెలు వసంత, జయంతిలు ఉన్నారు. వాసురెడ్డి అంత్యక్రియలు శుక్రవారం చేగుంట మండలం పోలంపల్లి స్వగ్రామంలో జరుగుతాయని బంధువులు తెలిపారు. వాసు రెడ్డి మృతి పై రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పద్మా దేవేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత శేఖర్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏ.విఠల్ రెడ్డి, పట్లోల్లా శశిధర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర నేతలు నందు జనార్దన్ రెడ్డి, నందా రెడ్డి, వేలుముల సిద్దిరాములు, డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

1985 -89వరకు వాసురెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా వ్యవహారించారు. బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా రామాయంపేట శాసనసభా నియోజక వర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాసు రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి అర్.ముత్యం రెడ్డి పై విజయం సాధించారు. సరిగ్గా నెల క్రితం కేంద్ర మంత్రి రూపాల చేగుంట మండలం పొలంపల్లి గ్రామం చేరుకొని మాజీ ఎమ్మెల్యే వాసు రెడ్డి దంపతులను సన్మానించారు.

బీజేపీ పార్టీకి వాసు రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. శాలువాతో వాసు రెడ్డిని కేంద్ర మంత్రి రూపాల సన్మానించి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఇంతలోనే వాసురెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం ఆ పార్టీ శ్రేణులను, అభిమానులను విషాదానికి గురి చేసింది.