Ramoji Rao | మంచం మీద రామోజీరావు.. ప్రస్తుతం ట్రెండింగ్ ఫొటో ఇదే

Ramoji Rao | విధాత: ఓ బంగారంతో చేసినట్లుండే ఓ భారీ కుర్చీలో అయన కూర్చుని ఉండగా మిగతా అంటే సీఎం స్థాయి వాళ్ళు అయినా.. ఉన్నతాధికారులు అయినా కాసింత దూరంగా వినయంతో నిలబడి ఆసక్తిగా వింటున్న ఫోటోలు మాత్రమే ఇన్నాళ్లుగా చూస్తూ వచ్చాము. కానీ నిన్నా ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయినా ఈ ఫోటో చూస్తుంటే రోజులన్నీ ఒకేలా ఉండవని మరోసారి అర్థం అవుతోంది. ఈనాడు , రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్, మీడియా […]

  • Publish Date - April 4, 2023 / 06:24 PM IST

Ramoji Rao |

విధాత: ఓ బంగారంతో చేసినట్లుండే ఓ భారీ కుర్చీలో అయన కూర్చుని ఉండగా మిగతా అంటే సీఎం స్థాయి వాళ్ళు అయినా.. ఉన్నతాధికారులు అయినా కాసింత దూరంగా వినయంతో నిలబడి ఆసక్తిగా వింటున్న ఫోటోలు మాత్రమే ఇన్నాళ్లుగా చూస్తూ వచ్చాము. కానీ నిన్నా ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయినా ఈ ఫోటో చూస్తుంటే రోజులన్నీ ఒకేలా ఉండవని మరోసారి అర్థం అవుతోంది.

ఈనాడు , రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్, మీడియా మొఘల్ రామోజీ రావును ఇలా ఓ మెడికల్ బెడ్ మీద పడుకుని ఉండగా ఎవరూ చూసిన వాళ్ళు లేరు. అయన గతంలో కాసింత అనారోగ్యానికి గురైనా ఆయన ఫోటోలు బయటకు రాలేదు.

కానీ మార్గదర్శి చిట్ ఫండ్ నిధులు పక్కదారి పట్టించిన విషయంలో ఏపీ సీఐడీ విభాగం కేసు బుక్ చేసి విచారణ ప్రారంభించిన తరుణంలో సంస్థ చైర్మన్ రామోజీ రావును సైతం అధికారులు ప్రశ్నించారు. తనకు ఆరోగ్యం బాలేదని చెప్పిన రామోజీ రావు తన ఇంటికే సీఐడీ వాళ్ళను పిలిపించుకున్నారు.

ఈ తరుణంలో కెమెరాల రికార్డింగ్ నడుమ విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన అనారోగ్యంతో నడుముకు బెల్ట్ కట్టుకుని బెడ్ మీద పడుకుని ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

వైసిపి సోషల్ మీడియా వీటిని విపరీతంగా షేర్ చేస్తోంది. ఎందర్నో తొంగోబెట్టిన రామోజీకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందని కామెంట్లు చేస్తూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు దర్యాప్తు ఫోటోలు బయటకు రావడం ఏమిటని ఈనాడు క్యాంప్ గోల పెడుతోంది.

ఇది అనైతికం, ఘోరం అని వాళ్ళు విమర్శిస్తుండగా మరి ఆరోజుల్లో జగన్ కేసుల విషయంలో ఈనాడు ఎన్ని రకాలుగా లీకులు రాయలేదు. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేస్తూ ఎన్ని కథనాలు ఇవ్వలేదు అని ఇట్నుంచి ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తానికి రామోజీరావును ప్రశ్నించే, విచారించే కాలం ఇన్నాళ్లకు వచ్చిందని అంటున్నారు.

మార్గదర్శిలో డిపాజిట్లుగా సేకరించిన డబ్బును రామోజీ రావు వేరే వ్యాపారాలకు మళ్లించారన్న ఆరోపణ మీద సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ సందర్భంగా తాము అలా డబ్బు మళ్లించిన విషయం నిజమే అని రామోజీ రావు (ramoji rao) పరోక్షంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.

Latest News