Rasi Phalalu | Today Horoscope చంద్రచారము ఆధారంగా
తేదీ: 06.06.2023; చంద్రచారము తెల్లవారుజాము 4.39 గంటల వరకు ధనూరాశి, తదుపరి మకరరాశి.
మేష రాశి: చంద్రుడు తెల్లవారుజాము 4.39 గంటల వరకు 9వ ఇంట ఉంటున్నందున ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన సమస్యలతో మనసు వేదనతో, విచారంతో ఉంటుంది.
తదుపరి 10వ ఇంటకు మారుతున్నందున సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక, గృహ, ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో గణనీయమైన మార్పులు తెస్తుంది.
వృషభ రాశి: చంద్రుడు తెల్లవారుజాము 4.39 గంటల వరకు 8వ ఇంట ఉండటం ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తుంది. దీని వలన ఆర్థికపరంగా కొన్ని నష్టాలు, వృత్తిపరంగా సమస్యలు తలెత్తి.. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది.
తదుపరి చంద్రుడు 9వ ఇంటకు మారుతున్నందున ప్రతికూల ఫలితాలు కొనసాగుతాయి. స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా మనసు వేదనతో, విచారంతో ఉంటుంది.
మిథున రాశి: చంద్రుడు తెల్లవారుజాము 4.39 గంటల వరకు 7వ ఇంట ఉండటం శుభప్రదం. ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో సఫలతలను ఆశించవచ్చు.
తదుపరి 8వ ఇంటకు మారటం వలన ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు, టెన్షన్ల కారణంగా స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది.
కర్కాటక రాశి: చంద్రుడు తెల్లవారుజాము 4.39 గంటల వరకు 6వ ఇంట ఉండటం సానుకూల ఫలితాలను కలుగజేస్తుంది. ఆర్థిక, వృత్తి, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో సాఫల్యాలు కలుగజేస్తుంది.
తదుపరి 7వ ఇంటకు మారుతున్నందున సానుకూల వాతావరణ కొనసాగుతుంది. ఆర్థిక, వృత్తి, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో మెరుగుదలను ఆశించవచ్చు.
సింహ రాశి: చంద్రుడు తెల్లవారుజాము 4.39 గంటల వరకు 5వ ఇంట ఉండటం ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంది. స్వల్ప నష్టాలు, కుటుంబ సమస్యలతో మనసు వేదనకు గురవుతుంది.
తదుపరి 6వ ఇంటకు మారుతున్నందున ఆరోగ్యం, ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగాల్లో చెప్పుకోతగిన మార్పులు కనిపిస్తాయి.
కన్యా రాశి: చంద్రుడు తెల్లవారుజాము 4.39 గంటల వరకు 4వ ఇంట ఉంటున్నందున ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. స్వల్ప నష్టాలు, సమస్యలతో వివాదాలు, శత్రుత్వాలు కలిగే అవకాశం ఉన్నది.
తదుపరి చంద్రుడు 5వ ఇంటకు మారుతున్నందున ప్రతికూల ప్రభావాలు కొనసాగి, కొన్ని స్వల్ప నష్టాలు, సమస్యలతో మానసికంగా టెన్షన్ అనుభవించే అవకాశం ఉన్నది.
తులా రాశి: చంద్రుడు తెల్లవారుజాము 4.39 గంటల వరకు 3వ ఇంట ఉండటం సానుకూలతలు కలుగజేస్తుంది. ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో అనుకూల ఘటనలు సంభవిస్తాయి. తదుపరి చంద్రుడు 4వ ఇంటకు మారుతున్నందున ప్రతికూల ప్రభావాలు కలిగేందుకు అవకాశం ఉన్నది. కొన్ని స్వల్ప వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా వివాదాలు, శత్రుత్వాలు కలిగవచ్చు.
వృశ్చిక రాశి: చంద్రుడు తెల్లవారుజాము 4.39 గంటల వరకు 2వ ఇంట ఉండటం ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తుంది. స్వల్ప ఆర్థిక నష్టాలు, సమస్యలతో మనసు టెన్షన్‌కు, దిగులుకు గురవుతుంది.
తదుపరి 3వ ఇంటకు మారుతున్నందున సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక, వృత్తిపరమైన విషయాలతోపాటు కుటుంబం సంబంధిత అంశాల్లో మెరుగుదలను ఆశించవచ్చు.
ధనూ రాశి: చంద్రుడు తెల్లవారుజాము 4.39 గంటల వరకు 1వ ఇంట ఉండటం శుభప్రదం. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి.
తదుపరి 2వ ఇంటకు మారుతున్నందున ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. స్వల్ప నష్టాలు, సమస్యలతో మనసు టెన్షన్‌కు, విచారానికి గురయ్యే వీలు ఉన్నది.
మకర రాశి: చంద్రుడు తెల్లవారుజాము 4.39 గంటల వరకు 12వ ఇంట ఉంటున్నందున ప్రతికూల పరిణామాలు కలుగవచ్చు. ఆర్థికంగా నష్టపోతారు.
దీని ప్రభావం కుటుంబ విషయాలు, ఆస్థి విషయాలపై కనిపించవచ్చు. తదుపరి 1వ ఇంటకు మారుతుండటం శుభప్రదం. వృత్తి, వ్యాపార రంగాల్లోనివారికి సానుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి: చంద్రుడు తెల్లవారుజాము 4.39 గంటల వరకు 11వ ఇంట ఉంటున్నందున సానుకూలంగా ఉంటుంది. గృహ, కుటుంబ విషయాల్లో లాభదాయ ఘటనలు చోటు చేసుకుంటాయి.
తదుపరి 12వ ఇంటకు మారుతున్నందున ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చు. ఆర్థిక నష్టాల వలన వృత్తి, వ్యాపారపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది.
మీన రాశి: చంద్రుడు తెల్లవారుజాము 4.39 గంటల వరకు 10 ఇంట ఉండటం శుభాలను కలుగజేస్తుంది. ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో చెప్పుకోగతగిన మార్పలు తెస్తుంది.
తదుపరి 11వ ఇంటకు మారుతున్నందున శుభాలే కలుగుతాయి. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది.