Republic TV
విధాత: ఇప్పటికే టివి యాంకర్లు, టివి రిపోర్టర్లు, న్యూస్ రీడర్ల మీద చాలా మీమ్స్, కామెంట్స్, పంచులు వస్తున్న తరుణంలో రిపబ్లిక్ టివిలో ఓ న్యూస్ రీడర్ చేసిన ఓవర్ యాక్షన్ మీద సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
తెలుగు మీడియాలోనూ కొన్ని చానెళ్లు సీన్ రీ క్రియేషన్ చేస్తున్నట్లు నటించడం.. ఆమధ్య శ్రీదేవి చనిపోతే బాత్ టబ్బులో కూర్చుని వార్తలు చదవడం, మర్డర్స్ జరిగినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు మొత్తం స్టూడియో లోంచి యుద్ధవిమానాలు వెళ్తున్నట్లు సీన్ క్రియేట్ చేసి వీక్షకులను బెంబేలెత్తించడం వంటి పనులు చేస్తూ ఛానెళ్ల యాంకర్లు అబాసు పాలవుతున్న సంగతి తెలిసిందే.
యాంకర్ ఓవర్ యాక్షన్… నెటిజన్స్ రియాక్షన్ https://t.co/gtFLBgT1wB #TELUGUNEWS #TELUGU #TamannaahBhatia #KritiSanon #ManOfMassesNTR #ADIPURUSH #Prabash pic.twitter.com/22uFBt2s0M
— vidhaathanews (@vidhaathanews) June 15, 2023
ఇప్పుడు గుజరాత్ తుపాను వార్తలు గురించి వివరిస్తూ రిపబ్లిక్ టివి న్యూస్ రీడర్ చేసిన అతి నెటిజన్లు, ఛానెల్ వీక్షకులకు చిర్రెత్తేలా చేసింది. తుపాను గాలికి ఎగిరిపోతున్నట్లు నటిస్తూ స్టూడియోలో గొడుగు వేసుకుని ఆమె చేసిన హడావుడి చూసి నవ్వుకుంటూనే పంచులు పంచారు… చాలిక ఆపండి అంటూ కొందరు.. బాగా ఎక్సట్రాస్ చేస్తున్నారు అంటూ కొందరు ఇలా కామెంట్స్ గుమ్మరిస్తున్నారు. ఆ వీడియో మీరూ ఒకసారి చూడండి.