Warangal l ఓరుగల్లులో కాంగ్రెస్ యాత్ర.. శ్రేణుల్లో కధనోత్సాహం

Political discussion in Orugallu ప్రస్ఫుటంగా వినిపించిన ప్రతిపక్ష గొంతు భారత్ జోడో స్పూర్తితో రేవంత్ హాత్‌సే హాత్ జోడో విమర్శలు, సవాళ్లు, దాడులు, ఉద్రిక్తత వరంగల్ జిల్లాలో ముగిసిన యాత్ర నర్సంపేట, జనగాం సెగ్మెంట్లు పెండింగ్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర రాజకీయ చర్చను రగిలించింది. నిన్నటి వరకు ఎక్కడికి అక్కడ నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చలనం వచ్చింది. బీఆర్ఎస్ […]

  • Publish Date - March 3, 2023 / 03:07 PM IST

Political discussion in Orugallu

  • ప్రస్ఫుటంగా వినిపించిన ప్రతిపక్ష గొంతు
  • భారత్ జోడో స్పూర్తితో రేవంత్ హాత్‌సే హాత్ జోడో
  • విమర్శలు, సవాళ్లు, దాడులు, ఉద్రిక్తత
  • వరంగల్ జిల్లాలో ముగిసిన యాత్ర
  • నర్సంపేట, జనగాం సెగ్మెంట్లు పెండింగ్

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర రాజకీయ చర్చను రగిలించింది. నిన్నటి వరకు ఎక్కడికి అక్కడ నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చలనం వచ్చింది. బీఆర్ఎస్ vs బీజేపీ అన్నట్లుగా రాజకీయ చర్చలు సాగుతున్న సమయంలో కాంగ్రెస్ మేమున్నామంటూ యాత్ర ద్వారా ముందుకు వచ్చింది. మా బలాబలగాలు తక్కువేమి కాదంటూ ప్రకటించే ప్రయత్నం చేశారు. యాత్రలో అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల అక్రమాలు అవినీతిపై రేవంత్ చేసిన సీరియస్ విమర్శలు చర్చకు దారి తీసాయి. యాత్ర చేపట్టిన ప్రాంతంలో సత్ఫలితాలు లభిస్తున్నాయనే అభిప్రాయం కాంగ్రెస్‌లో నెలకొంది. పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. అడ్డంకులు ఎదురైనా యాత్ర ముందుకు కొనసాగుతోంది. రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రేతో సహా ఎఐసీసీ, పీసీసీ నాయకుల రాకపోకలు, హడావుడి, పరామర్శలతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన సంతోషం వ్యక్తం అవుతుంది.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: (Country wide )దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ(Rahul) కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర కొత్త ఉత్సాహం నింపింది. అనంతరం ఏఐసీసీ పిలుపుమేరకు హాత్ సే హాత్ జూడో యాత్రను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చొరవ ప్రదర్శించి ప్రారంభించారు. యాత్ర చేపట్టిన వరంగల్ జిల్లాలో రాజకీయ వేడిని రగిల్చింది.

విభేదాలను పక్కనపెట్టి యాత్ర..

కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు (Groups) ఆధిపత్యం, బహిరంగ కుమ్ములాటలు అనే పేరుపొందింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి అతీతంగా లేదు. ఇటీవల కాలంలో తీవ్రమైన గ్రూపు విభేదాలతో సీనియర్ వలసవాదుల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. విభేదాలను పెద్దగా పట్టించుకోకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanthreddy) వరంగల్ ఉమ్మడి జిల్లా మేడారం నుంచి గత నెల ఆరవ తేదీన యాత్ర ప్రారంభించారు.

తీవ్ర విమర్శలతో రగిలిన రాజకీయ వేడి

ఇప్పటివరకు రేవంత్ యాత్ర సాగిన నియోజకవర్గాలలో రాజకీయ వేడి(Political heat) రగులుతోంది. అధికార పార్టీపై, అక్కడి ఎమ్మెల్యేలపై, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలపై చేసిన విమర్శలు, తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను వివరిస్తూ చేసిన ప్రసంగాలు కొత్త చర్చకు దారి తీశాయి. చాలా రోజులకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం గొంతు బలంగా వినిపించే ప్రయత్నం ఈ యాత్ర ద్వారా సాగుతోంది.

రేవంత్ రెడ్డి మాటల్లో తీవ్రత, చేస్తున్న ఘాటు విమర్శలతో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యానాయక్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు తీవ్రంగా ప్రతిస్పందించారు.

రేవంత్ రెడ్డి పై విమర్శల దాడిని తీవ్రం చేశారు. ఈ యాత్ర క్రమంలో ప్రతి విమర్శలే కాకుండా కేసులు పెట్టారు. సవాళ్లు ప్రతి సవాళ్లకే పరిమితం కాకుండా బహిరంగ చర్చకు సిద్ధమంటూ బాహా బాహికి దిగారు.

రేవంత్ యాత్ర టెన్షన్ల మధ్య కొనసాగింది. ఆఖరికి హనుమకొండలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తపై తీవ్ర దాడి చేశారు. భూపాల్ పల్లిలో రాళ్ల, కోడిగుడ్ల దాడులు చేశారు.

రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూర్తి

(Medaram)మేడారం నుంచి వేసిన తొలి అడుగు ఇప్పటికే మొదటి దశలో మానుకోట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నర్సంపేట మినహా ములుగు మానుకోట, డోర్నకల్, ఇల్లెందు, పినపాక, అశ్వరావుపేట, భద్రాచలం సెగ్మెంట్లలో యాత్ర పూర్తి చేసుకుంది.

రెండో విడత వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి, స్టేషన్గన్పూర్, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాల్ పల్లి సెగ్మెంట్లలో పూర్తి చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నర్సంపేట జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది.

మిగిలిన నర్సంపేట, జనగామ సెగ్మెంట్లు

ఉమ్మడి వరంగల్ జిల్లా (warangal dist)పరిధిలో నర్సంపేట, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా అన్ని నియోజకవర్గాలు పూర్తయ్యాయి. ఆఖరికి గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరన్నను దర్శించుకుని హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో యాత్ర చేపట్టారు.

రానున్న రోజుల్లో జరిగే యాత్రలో మిగిలిన ఈ రెండు సెగ్మెంట్‌లు భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ జనగామ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గానికి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Latest News