ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి డుమ్మా.. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ

విధాత, ఈడి విచారణకు ఈ రోజు హాజరు కావాల్సిన పైలట్ రోహిత్ రెడ్డి అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకొని తాను ఈ నెల 25 వరకు అందుబాటులో ఉండలేనంటూ ఈడీకి లేఖ పంపించారు. రోహిత్ రెడ్డి తన పీఏ శ్రవణ్‌తో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌కు లేఖను అందించారు. ఈడీ నోటీసుల మేరకు తాను ఈరోజు విచారణకు హాజరవుతానంటూ సోమవారం ఉదయం విచారణకు బయలుదేరిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్యలో అనూహ్యంగా ప్రగతి భవన్కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో […]

  • Publish Date - December 19, 2022 / 08:30 AM IST

విధాత, ఈడి విచారణకు ఈ రోజు హాజరు కావాల్సిన పైలట్ రోహిత్ రెడ్డి అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకొని తాను ఈ నెల 25 వరకు అందుబాటులో ఉండలేనంటూ ఈడీకి లేఖ పంపించారు. రోహిత్ రెడ్డి తన పీఏ శ్రవణ్‌తో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌కు లేఖను అందించారు.

ఈడీ నోటీసుల మేరకు తాను ఈరోజు విచారణకు హాజరవుతానంటూ సోమవారం ఉదయం విచారణకు బయలుదేరిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్యలో అనూహ్యంగా ప్రగతి భవన్కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

ఉదయం ఇంటి నుండి బయలుదేరిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ రాహు కాలం ముగిసిందని ఈడీ విచారణకు వెళుతున్నానని చెప్పిన రోహిత్ రెడ్డి మధ్యలో అకస్మాత్తుగా ప్రగతిభవనన్ కి వెళ్లారు. సీఎం కేసీఆర్‌తో చర్చల పిదప తాను ఈరోజు విచారణకు హాజరు కావడం లేదని ఈనెల 25 వరకు అందుబాటులో ఉండనంటూ ఈడికి లేఖ పంపించారు.

ఉదయం విచారణకు బయలుదేరిన రోహిత్ రెడ్డి సీఎంతో చర్చల పిదప ఆయన సూచన మేరకే నిర్ణయం మార్చుకున్నారు. ఈడీ అడిగిన బ్యాంక్ స్టేట్మెంట్లు ,ఇతర పత్రాలు తీసుకు వచ్చేందుకు తనకు మరింత సమయం కావాలని లేఖలో రోహిత్ రెడ్డి పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌తో భేటీ ముగిశాకా తిరిగి రోహిత్ రెడ్డి తన నివాసానికి వెళ్లిపోయారు.

నిరాకరించిన ఈడీ

అయితే డాక్యుమెంట్స్‌ సమర్పించడానికి మరి కొంత సమయం కావాలని, అందుబాటులో ఉండనని ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తిని ఈడీ తోసిపుచ్చింది. దీంతో రోహిత్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.