Samyuktha Menon
విధాత: సాయిధరమ్ తేజ్ రీ ఎంట్రీ ఫిల్మ్ ‘విరూపాక్ష’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఓవర్సీస్‌లో సైతం ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ను రాబడుతుండటం విశేషం.
ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్‌లో 1 మిలియన్ ప్లస్ కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 5న ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తెలుగులో ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోగా.. ఇతర భాషల్లో ఎలాంటి రిజల్ట్‌ను సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
ఇదిలాఉండగా ఇక ఈ సినిమా దర్శకుడు కార్తీక్ దండుకి హీరోయిన్ సంయుక్తా మీనన్ ఐ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హైలెట్ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ సంయుక్తానే తెలిపింది. ‘విరూపాక్ష’ సినిమాలో సంయుక్తా మీనన్ పాత్ర హైలెట్‌గా ఉంటుంది. అసలు విషయం ఇక్కడ రివీల్ చేయకూడదు కాబట్టి.. చేయడం లేదు కానీ.. సంయుక్తా మీనన్‌కు చాలా మంచి పాత్రని దర్శకుడు ఇచ్చాడు.
హీరో కంటే కూడా ప్రధానమైన పాత్ర ఆమెది. ఆ కృతజ్ఞతతో పాటు సినిమా కూడా బ్లాక్‌బస్టర్ కావడంతో.. దర్శకుడికి ఏదైనా గిఫ్ట్‌గా ఇవ్వాలని సంయుక్తా భావించిందట. అయితే సినిమా రిలీజ్ రోజు.. చిత్ర యూనిట్‌తో కలిసి దర్శకుడు ఓ థియేటర్‌కి వెళ్లగా.. అక్కడ ఆయన ఫోన్‌ని ఎవరో కొట్టేశారు. ఆయన ఫోన్ పోయిన విషయంపై వార్తలు కూడా వచ్చాయి.
అయితే దర్శకుడికి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్న సంయుక్తకు.. ఫోన్ పోయిందని తెలిసి.. వెంటనే ఐఫోన్ ప్రో మోడల్ మొబైల్‌ను కొని.. గిఫ్ట్‌గా ఇచ్చిందట. తన ఫోన్ పోవడంతో.. సినిమాకు సంబంధించి వస్తున్న టాక్‌ను దర్శకుడు వేరే వాళ్ల ఫోన్ చూసి తెలుసుకున్నాడని సంయుక్తా తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
సంయుక్త గిఫ్ట్ విషయాన్ని తెలుసుకున్న నెటిజన్లు.. ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంత వరకు ఏ హీరోయిన్ ఇలా చేయలేదని.. చాలా గొప్ప మనసు నీది అంటూ సంయుక్తా మీనన్‌ని ప్రశంసల జల్లులతో తడిపేస్తున్నారు.
‘విరూపాక్ష’ విషయానికి వస్తే.. సంయుక్తా మీనన్ నటనతో పాటు.. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అందించిన స్ర్కీన్‌ప్లే కూడా ప్రధాన హైలెట్‌గా నిలిచింది. మొత్తంగా అయితే.. ‘దసరా’ సక్సెస్‌ని కంటిన్యూ చేస్తూ.. టాలీవుడ్‌కి ఈ చిత్రం మరో మంచి విజయాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు.