Naga Chaitanya | స‌మంత పెళ్లి వేళ ట్వీట్ చేసిన నాగ చైత‌న్య‌.. నెట్టింట పోస్ట్ వైర‌ల్

Naga Chaitanya | టాలీవుడ్‌లో కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ, పూర్తిగా తన పనిపైనే దృష్టి పెట్టే హీరోల్లో అక్కినేని నాగ చైతన్య మొదటి వరుసలో నిలుస్తాడు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే చైతూ తన సింప్లిసిటీ, నిష్కళ్మషమైన ప్రవర్తనతో అభిమానులకు మరింత చేరువ అవుతుంటాడు.

Naga Chaitanya | టాలీవుడ్‌లో కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ, పూర్తిగా తన పనిపైనే దృష్టి పెట్టే హీరోల్లో అక్కినేని నాగ చైతన్య మొదటి వరుసలో నిలుస్తాడు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే చైతూ తన సింప్లిసిటీ, నిష్కళ్మషమైన ప్రవర్తనతో అభిమానులకు మరింత చేరువ అవుతుంటాడు.ఇటీవ‌ల విడుదలైన ‘తండేల్’ చిత్రం ఘనవిజయం సాధించి, రూ.100 కోట్ల గ్రాస్‌ను దాటిన విషయం తెలిసిందే. ఎమోషనల్ నేరేటివ్‌తో వచ్చిన ఈ సినిమా చైతు కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. అలానే దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ‘దూత’ చైతు కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అదిరిపోయే ట్విస్టులు, హై ఎంగేజ్‌మెంట్‌తో ఈ సిరీస్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌కు కట్టిపడేసింది. ఇందులో నాగ చైతన్య నటన కూడా విశేషంగా ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు, సిరీస్ విడుదలై రెండు సంవత్సరాలు పూర్తయ్యే సరికి నాగ చైతన్య చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చైతూ తాజా ట్వీట్‌లో.. నటుడిగా ఒక సృజనాత్మకమైన కథను ఎంచుకుని, నిజాయతీగా పని చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ‘దూత’. ఈ సిరీస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ బయటకి రాగానే ‘దూత 2’పై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.మ‌రోవైపు స‌మంత‌-రాజ్ పెళ్లి స‌మ‌యంలో చైతూ ఈ పోస్ట్ చేయ‌డం కూడా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కొన్ని నెల‌ల క్రితం చై-సామ్ విడాకులు తీసుకోగా, వారిద్ద‌రు రెండో పెళ్లి చేసుకున్నారు.

ప్రస్తుతం నాగ చైతన్య ‘వృషకర్మ’ అనే పీరియాడిక్–థ్రిల్లర్ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన స్పెషల్ వీడియో ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ క్రియేట్ చేసింది. విజువల్స్, కాన్సెప్ట్, చైతు లుక్ అన్ని టాప్ క్లాస్ అనిపించాయి. ఈ సినిమాను చైతు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు మేకర్స్. తండేల్ తర్వాత, వృషకర్మ కూడా మరో 100 కోట్ల హిట్‌గా నిలుస్తుంద‌ని ఫ్యాన్స్ చెబుతున్నారు. నాగ చైతన్య కెరీర్ గ్రాఫ్ మళ్లీ పీక్‌లోకి వెళ్తుందనడంలో సందేహం లేదు.

Latest News