Naga Chaitanya- Sobhita : నాగ చైతన్యతో పెళ్లికి ఏడాది..శోభిత స్పెషల్ వీడియో వైరల్

నాగ చైతన్య–శోభిత దూళిపాళ పెళ్లి జరిగి ఏడాది పూర్తై ప్రత్యేక వీడియోను శోభిత షేర్ చేసింది. వారి వెడ్డింగ్ ఆల్బమ్ సీన్స్‌తో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Naga Chaitanya-Sobhita Marriage Anniversary

విధాత : నటుడు అక్కినేని నాగ చైతన్యతో శోభిత దూళిపాళ పెళ్లి జరిగి ఏడాది పూర్తయ్యింది. 2024 డిసెంబర్‌ 4న హిందూ సంప్రదాయ పద్ధతిలో నాగచైతన్య – శోభితల వివాహం జరిగింది. తమ మొదటి పెళ్లి రోజు వార్షికోత్సవం సందర్భంగా శోభిత స్పెషల్ వీడియోని షేర్ చేశారు. మనసున బంధమే..వేద మంత్రమే..ఊసుల బాసలే మంగళ వాద్యమై…పాటతో సాగిన వీడియోలో నాగ చైతన్య, శోభితల పెళ్లీ వేడుకల ఘట్టంతో అందమైన ఆల్బమ్ మాదిరిగా ఆకట్టుకుంది. పెళ్లి వేడుకలోని సరదా ఘట్టాలు..ఇరు కుటుంబాల బంధుమిత్రుల కోలహాలం సన్నివేశాలలో వీడియో సాగింది. వీడియోలో తమ పెళ్లి బంధంపై నాగ చైతన్య, శోభితలు చెప్పిన మాటలు ప్రత్యేకంగా నిలిచాయి.

వీడియోకు శోభిత ఒక ఎమోష‌న‌ల్‌ క్యాప్షన్‌ను కూడా జతచేసింది. “గాలి ఎప్పుడూ ఇంటి వైపుకే వీస్తుంది. నేను దక్కన్ ప్రాంతానికి తిరిగి వచ్చి, నా భర్తగా ఉన్న వ్యక్తితో కలిసి సూర్యుని చుట్టూ ఒక పూర్తి ప్రయాణాన్ని (సంవత్సరాన్ని) ముగించాను. నాగచైతన్య తన లైఫ్‌లోకి వచ్చాకే జీవితం పరిపూర్ణమైందని అమె అన్నారు. అగ్నితో శుద్ధి అయినట్లుగా నాకు కొత్త అనుభూతి కలుగుతోంది. శ్రీమతిగా ఒక సంవత్సరం…అంటూ ఆమె తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవలే నాగ చైతన్య మాజీ భార్య నటి సమంత సైతం రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సమంత కూడా తాజాగా తన పెళ్లి వేడుకల ఫోటోలను సోషల్ మీడియలో షేర్ చేయడం గమనార్హం. డిసెంబర్ 1వ తేదీ సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో సమంత, రాజ్ నిడిమోరుల పెళ్లి జరిగింది. వారిద్దరికి ఇది రెండో పెళ్లి. అంతకుముందు సమంత 2017 అక్టోబర్ 6న హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. మూడున్నరేళ్ల పాటు సాగిన వారి వైవాహిక బంధంలో రేగిన విబేధాల నేపథ్యంలో 2021 ఆక్టోబర్ లో విడాకులతో ముగిసింది.

ఇవి కూడా చదవండి :

Ram Attack Student : పొట్టేలుతో ఆట..సచ్చాంరో బాబోయ్
Elephant Pushes Policeman : భక్తులకు నాకు మధ్య నువ్వేంది..పోలీసును ఎత్తిపడేసిన ఏనుగు

Latest News