Naga Chaitanya | నాగ చైత‌న్య బ‌ర్త్ డే స్పెష‌ల్.. ‘వృషకర్మ’ ఫస్ట్ లుక్‌తో పెరిగిన అంచ‌నాలు

Naga Chaitanya | అక్కినేని నాగ చైతన్య హీరోగా, దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం నుంచి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Naga Chaitanya | అక్కినేని నాగ చైతన్య హీరోగా, దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం నుంచి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన‌ విడుదలైన రెండు మేకింగ్ వీడియోలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు నాగ చైతన్య ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘వృషకర్మ (Vrushakarma)’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించగా, ఈ ఫస్ట్ లుక్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసి టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విడుదలైన వెంటనే నాగ చైతన్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లోకి చేరింది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అద్భుతమైన యాక్షన్, మిస్టరీ టచ్ కలగలిపిన కథాంశం ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. ఫస్ట్ లుక్‌తో మరింత హైప్ తెచ్చుకున్న‌ ‘వృషకర్మ’ ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందా అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

‘కాంతారా’ ఫేమ్ అజనీష్ బి లోక్‌నాథ్ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చివ‌రిగా తండేల్ చిత్రంతో మంచి హిట్ కొట్టిన నాగ చైత‌న్య ఇప్పుడు వృష‌క‌ర్మ అనే మైథ‌లాజిక‌ల్ చిత్రంతో మరింత ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నారు. ఇన్నాళ్లు లవ్, ఫ్యామిలీ స్టోరీలకే పెద్దపీట వేసిన నాగ చైత‌న్య‌ ఇప్పుడు విభిన్నమైన కథల‌తో ప్రేక్షకులని అల‌రించేందుకు సిద్ధమవుతున్నాడు. మజిలీ, లవ్ స్టోరీ, కస్టడీ, తండేల్ వంటి హిట్ సినిమాల తర్వాత ఆయన ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాడు. ‘విరూపాక్ష’తో తన సత్తా ఏంతో నిరూపించుకున్న కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాగ చైత‌న్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన పోస్ట‌ర్ ఆస‌క్తి రేకెత్తిస్తుంది. చైతూ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తూ ఫ్యాన్స్‌లో అంచ‌నాలు పెంచుతున్నాడు.

Latest News