Nava Panchama Yogam | జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఫిబ్రవరి 23 సోమవారం తెల్లవారుజామున 1.29 గంటలకు బుధ, గురు గ్రహం ఒకదానికి ఒకటి 120 డిగ్రీల కోణంలో ఉండి నవ పంచమ యోగాన్ని ఏర్పరిచాయి. చాలా శుభప్రదంగా భావించే ఈ యోగం వల్ల నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు లభించనున్నాయి. ఇంతకీ ఆ నాలుగు రాశులేవో తెలుసుందాం.
మిథున రాశి (Gemini)
నవ పంచమ యోగం కారణంగా మిథున రాశి వారికి కలిసి రానుంది. ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. నగదు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఏ పని చేపట్టిన విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి (Cancer)
నవ పంచమ యోగం కర్కాటక రాశి వారిలో కొత్త జీవితాన్ని తీసుకు వస్తుంది. వాయిదా పడ్డ పనులు సులభంగా పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఏ పని చేపట్టినా ఆటంకం లేకుండా ముందుకు సాగిపోతారు. ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి నవ పంచమ యోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. జీవితంలో కూడా ఉన్నతస్థానానికి ఎదుగుతారు. ఉద్యోగం చేసే వారికి తమ వృత్తిలో పదోన్నతులు లభించనున్నాయి. సీనియర్ అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
ధనస్సు రాశి (Sagittarius)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ధనస్సు రాశి వారికి నవ పంచమ యోగం లక్కు తీసుకొస్తుంది. ఈ సమయంలో అదృష్టం మొత్తం వీరివైపే ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పొచ్చు.
