Kidney Tumor | అరుదైన శ‌స్త్ర చికిత్స‌.. ఓ రోగికి 20 సెం.మీ. కిడ్నీ క‌ణితి తొల‌గింపు

Kidney Tumor | పొత్తిక‌డుపు వాపు, అల‌స‌ట‌తో ఆస్ప‌త్రిలో చేరిన రోగికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన డాక్ట‌ర్లు షాక‌య్యారు. అత‌ని మూత్ర‌పిండాల వ‌ద్ద గుమ్మ‌డికాయ ప‌రిమాణంలో ఉన్న క‌ణితిని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించి, ఆ క‌ణితిని తొల‌గించారు.

  • By: raj |    telangana |    Published on : May 25, 2026 8:10 AM IST
Kidney Tumor | అరుదైన శ‌స్త్ర చికిత్స‌.. ఓ రోగికి 20 సెం.మీ. కిడ్నీ క‌ణితి తొల‌గింపు

Kidney Tumor | హైద‌రాబాద్ : పొత్తిక‌డుపు వాపు, అల‌స‌ట‌తో ఆస్ప‌త్రిలో చేరిన రోగికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన డాక్ట‌ర్లు షాక‌య్యారు. అత‌ని మూత్ర‌పిండాల వ‌ద్ద గుమ్మ‌డికాయ ప‌రిమాణంలో ఉన్న క‌ణితిని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించి, ఆ క‌ణితిని తొల‌గించారు. ఈ అరుదైన శ‌స్త్ర చికిత్సకు బంజారాహిల్స్‌లోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (AINU) ఆస్ప‌త్రి వేదికైంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌ర్నూల్ జిల్లాకు చెందిన 53 ఏళ్ల వ్య‌క్తి గ‌త కొంత‌కాలంగా పొత్తి క‌డుపు వాపుతో బాధ‌ప‌డుతున్నాడు. అంతేకాదు అల‌స‌ట‌గా మారిపోవ‌డం, ఆక‌లి లేక‌పోవ‌డం వంటి విష‌యాలు అత‌న్ని మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేశాయి. దీంతో ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (AINU) ఆస్ప‌త్రి వైద్యుల‌ను ఆశ్ర‌యించాడు.

ఇక వైద్యులు అత‌నికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా షాకింగ్ విష‌యం వెలుగు చూసింది. కిడ్నీ వ‌ద్ద ఓ భారీ క‌ణితిని వైద్యులు గుర్తించారు. పేగుల‌ను ప‌క్క‌కు తోసేసి.. పొత్తిక‌డుపు వ‌ర‌కు ఆ క‌ణితి వ్యాపించింది. మొత్తానికి వైద్యులు డాక్ట‌ర్ పూర్ణ‌చంద్ర రెడ్డి, డాక్ట‌ర్ రాజేశ్ కుమార్ రెడ్డి క‌లిసి.. శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించి క‌ణితిని తొల‌గించారు. అయితే ఈ క‌ణితి 20 సెంటిమీట‌ర్ల ప‌రిమాణంలో ఉంద‌ని వైద్యులు తెలిపారు.

ప్ర‌స్తుతం బాధిత రోగి కోలుకుంటున్నార‌ని వైద్యులు స్ప‌ష్టం చేశారు. అయితే ఆ క‌ణితి క్యాన్స‌ర్ కార‌కమ‌ని త‌ర్వాతి ప‌రీక్ష‌ల్లో నిర్ధారించారు. ముంద‌స్తుగానే అప్ర‌మ‌త్తం కావ‌డంతో స‌ద‌రు రోగి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడ‌ని వైద్యులు పేర్కొన్నారు. అధునాతన వైద్య సదుపాయాల‌ను ఉప‌యోగించి శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించామ‌ని స్ప‌ష్టం చేశారు.