పవన్ కళ్యాణ్‌కు ముంబైలో 3 గంటల పాటు సర్జరీ

రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ సమస్యతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో మూడు గంటల పాటు భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Jul 11, 2026, 1:04 pm IST
Read Time: 2 mins
పవన్ కళ్యాణ్‌కు ముంబైలో 3 గంటల పాటు సర్జరీ

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ రెండు భుజాలకు ‘రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్’ సమస్య నేపథ్యంలో వైద్యులు సర్జరీ నిర్వహించారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి వైద్యులు మూడు గంటల పాటు శస్త్ర చికిత్స చేశారు. ఒకేసారి రెండు భుజాలకు ఆపరేషన్ చేస్తే.. నొప్పి భరించలేని స్థాయిలో ఉంటుందని, అందుకే ఇప్పుడు కుడి భుజానికి సర్జరీ చేశామని, రెండు నెలల్లో ఎడమ భుజానికి సర్జరీ చేస్తామని వైద్యులు వెల్లడించారు.

2016లో పవన్‌కు ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్స్ చేతులు పట్టి లాగడంతో భుజం సమస్య తీవ్రమైంది. దీంతో ఆయన సమస్య పరిష్కారానికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పవన్ కు శస్త్ర చికిత్స విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో, అత్యంత వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.