Zodiac Signs | అపర కుబేర యోగం.. ఉగాది తర్వాత ఈ ఆరు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
Zodiac Signs | ఉగాది( Ugadi ) తర్వాత ఏర్పడబోయే అపర కుబేర యోగం( Apara Kubera Yogam ) వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి. మరి ముఖ్యంగా ఈ ఆరు రాశుల( Zodiac Signs ) వారి జీవితాల్లో గొప్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. వారు ఊహించని విధంగా ధన సంపద సమకూరనుంది. ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. పట్టిందల్లా బంగారమే( Gold ) కానుంది. భారీగా వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేయనున్నారు. ఇంతకీ ఆ ఆరు రాశులేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
Zodiac Signs | ఉగాది( Ugadi ) తర్వాత కొన్ని రాశుల వారు స్వర్ణాభరణాల మీదా, షేర్లు, స్పెక్యులేషన్ల మీదా భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. వీరికి ఆస్తిపాస్తులు కలిసి రావడం, లాటరీ రావడం, ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, దనుస్సు, మకర రాశుల( Zodiac Signs ) వారు విశేషంగా వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. వీరికి అపర కుబేర యోగం, లక్ష్మీ యోగం కలుగుతాయి.
మేషం (Aries)
రవి, శుక్రుడు ఈ రాశి వారికి అనుకూలం కావడం వల్ల తప్పకుండా అపక కుబేర యోగం కలగనుంది. దీంతో మార్చి 19న ఉగాది తర్వాత.. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గృహ, వాహన కొనుగోలు కూడా చేయనున్నారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
మిథునం (Gemini)
ఉగాది తర్వాత మిథున రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. దీంతో ఆకస్మిక ధన లాభం కలగనుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందనుంది. అపర కుబేర యోగం కారణంగా ఆస్తిపాస్తులు పెరుగుతాయి. లాటరీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఊహించని పరిణామాల నేపథ్యంలో విలువైన వస్తువులతో పాటు భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కర్కాటకం (Cancer)
ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో రవి, శుక్రుల సంచారం వల్ల అపారమైన ధన లాభం కలుగుతుంది. వీరిని అనేక విధాలుగా ధన లక్ష్మి కరుణిస్తుంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడు కావడానికి అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వస్త్రాభరణాలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. రావలసిన సొమ్ము, బాకీలు వసూలవుతాయి.
తుల (Libra)
తులా రాశి వారికి కూడా ధన సంపద భారీగా సమకూరనుంది. దీంతో రియల్ ఎస్టేట్‌లో భారీగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే ప్రమోషన్లు లభించి.. ధనం సమకూరే అవకాశం ఉంది. షేర్ల ద్వారా కూడా కుబేరులు అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది.
ధనుస్సు (Sagittarius)
ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో రవి, శుక్రుల సంచారం, రాశినాథుడు ఈ రాశిని వీక్షించడం వంటి కారణాల వల్ల ఈ రాశివారి ఆదాయం, సంపాదన బాగా పెరిగే అవకాశం ఉంది. రికార్డు స్థాయిలో వస్త్రాభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది.
మకరం (Capricorn)
ఈ రాశికి రవి, శుక్రుల బలం వల్ల అపర కుబేర యోగం కలిగింది. దీనివల్ల ఆదాయ వృద్ధితో పాటు వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం, షేర్లు, స్పెక్యులేషన్లలో భారీగా పెట్టుబడులు పెట్టడం వంటివి జరుగుతాయి. గురు బలం వల్ల లక్ష్మీ కటాక్షం అపారంగా లభిస్తుంది. ప్రతి ప్రయత్నంలోనూ విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram