Sania Mirza: హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భర్త షోయబ్ మాలిక్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా ఉండేవారు. గత కొద్ది రోజులుగా వారికి సంబంధించి అనేక వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని ఇద్దరూ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్లుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని ఆ కారణంగానే విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల నడుమ వీరిరివురు కలిసి కనిపించడంతో పుకార్లకి పులిస్టాప్ పడింది. ఇక మరోసారి షోయబ్ మాలిక-సానియా మీర్జా విడాకుల విషయం తెరపైకి వచ్చింది.
ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ విడాకుల విషయంపై హింట్ ఇస్తున్నారు. సమంత, నిహారిక, శ్రీజ ఇలా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారానే అందరిలో అనుమానాలు కలిగించారు. ఇక ఇప్పుడు షోయబ్ మాలిక్ కూడా తన భార్య సానియా నుండి విడిపోయినట్టు సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చాడని అంటున్నారు. షోయబ్ మాలిక్ రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను మార్చారు. గతంలో సానియా, షోయబ్ కలిసి దిగిన ఫొటో ప్రొఫైల్ పిక్‌గా ఉండగా, ఇప్పుడు దానిని తొలగించి.. తన సింగిల్ ఫోటోను ప్రొఫైల్ ఫిక్ గా పెట్టుకున్నాడు. అలాగే..ఇన్‌స్టాగ్రామ్ బయోను కూడా మార్చేయడంతో అందరిలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.
అప్పట్లో షోయబ్ మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ బయోలో ‘సూపర్ ఉమెన్ సానియా మీర్జా’ అని రాసి ఉండేది. కాని దానిని తన బయోలోంచి తొలగించి.. కేవలం తన వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరిచాడు. ఈ మార్పుల తర్వాత వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, వీడిపొయేందుకు సిద్ధమయ్యారని ప్రచారాలు నడుస్తున్నాయి. పాక్ మీడియా కూడా వారిరివుఉ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు ప్రసారం చేసింది. మరి ఈ విషయంలో సానియా, షోయబ్‌ల నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడని కారణంగా ఈ విషయం ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. కాగా, షోయబ్ మాలిక్.. పాకిస్థానీ నటి అయేషా ఉమర్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నడని కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తుంది.