విధాత: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బాజకుంటలో సర్పంచ్ సరిత ఓ దళితుడిపై చెప్పుతో దాడి చేయడం వివాదాస్పదమైంది. ఇటీవల గ్రామంలో ఓ ఇంట్లో విందు భోజనాల సమయంలో అగ్ర కులాల వారు భోజనాలు పూర్తి చేశాక దళితులను భోజనాలకు రమ్మని పిలిచారు.
ఈ సందర్భంగా తలెత్తిన వివాదంపై శుక్రవారం గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటుండగా తన భర్తను, బంధువులను తిట్టారన్న ఆగ్రహంతో సర్పంచ్ సరిత పర్కాల పరుశారమ్ అనే దళిత వ్యక్తిపై చెప్పుతో దాడి చేసింది. ఈ ఘటనతో ఆగ్రహించిన దళితులు ధర్నా చేసి నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.