యాదాద్రిలో సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాల ప్రారంభం

విధాత, యాదగిరిగుట్ట: మూడు సంవత్సరాల బి.ఏ. ట్రెడిషనల్ క‌ల్చ‌ర్‌ అండ్ ఆర్కిటెక్చర్ (టెంపుల్ ఆర్కిటెక్చర్) ప్రతిష్టాత్మకమైన కోర్సు ను యాదగిరిగుట్ట బస్టాండ్ ఎదురుగా, ఆండాళ్ సాధనము వెనుక పాఠశాల భవనంలో 15 మంది విద్యార్థులతో తరగతులు, అడ్మిషన్ వై.టి. డి.ఏ ( యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ) వారు ప్రారంభించారు. సంప్రదాయ శిల్పకళా, దేవాలయ నిర్మాణం, ఆగమశాస్త్రం నేర్పించే ఈ కళాశాల తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన మొదటి కళాశాల. ఈ కళాశాల ఏర్పాటు కోసం వై.టి. […]

  • Publish Date - December 3, 2022 / 04:51 PM IST

విధాత, యాదగిరిగుట్ట: మూడు సంవత్సరాల బి.ఏ. ట్రెడిషనల్ క‌ల్చ‌ర్‌ అండ్ ఆర్కిటెక్చర్ (టెంపుల్ ఆర్కిటెక్చర్) ప్రతిష్టాత్మకమైన కోర్సు ను యాదగిరిగుట్ట బస్టాండ్ ఎదురుగా, ఆండాళ్ సాధనము వెనుక పాఠశాల భవనంలో 15 మంది విద్యార్థులతో తరగతులు, అడ్మిషన్ వై.టి. డి.ఏ ( యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ) వారు ప్రారంభించారు.

సంప్రదాయ శిల్పకళా, దేవాలయ నిర్మాణం, ఆగమశాస్త్రం నేర్పించే ఈ కళాశాల తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన మొదటి కళాశాల. ఈ కళాశాల ఏర్పాటు కోసం వై.టి. డి.ఏ వైస్ చైర్మన్ జి. కిషన్ రావు ఐ.ఏ.యస్ (రిటైర్డ్) , ఈ.ఓ గీత, వై.టి. డి.ఏ డిప్యూటీ స్థపతి డా.మోతిలాల్ నిరంతరం కృషి చేశారు.

కాలేజీకి జవహార లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (JNAFAU) అఫిలియేషన్ ఇచ్చింది. ఈ కళాశాల నడపడం కోసం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు కేటాయించించింది.

సిలబస్ తయారీకి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కవిత దర్యాని ప్రత్యేక ప్రోత్సాహంతో సిలబస్ కమిటీలో ప్రొఫెస్సర్ యస్.కుమార్, స్థపతి డా.సుందర రాజన్, ప్రొఫెసర్ శ్రీనివాస్, ప్రొఫెసర్ శాంతి స్వరూపిణి, ప్రొఫెసర్, స్థపతి డా.గోవిందు సురేంద్ర, స్థపతి డా.మోతిలాల్ కృషి చేశారు.

ప్రస్తుతం తాత్కాలిక ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ గా వై.టి. డి.ఏ డిప్యూటీ స్థపతి మోతిలాల్ కొనసాగనుండగా, స్థపతులు హేమాద్రి, మొగిలి టీచింగ్ స్టాఫ్ గా పనిచేస్తున్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికీ దేవాలయ నిర్మాణ రంగంలో ఉద్యోగమూ, ఉపాధితో పాటు పై చదువుల కోసం అవకాశము క‌ల్పించ‌నున్నారు.