YouTube Income | యూట్యూబ్‌ ఆదాయానికి ఇన్‌కం ట్యాక్‌ చెల్లించాలా..? ఐటీఆర్‌ ఎలా దాఖలు చేయాలి..?

YouTube Income | ప్రస్తుతం చాలా మంది యూట్యూబ్‌ను ఆధారంగా చేసుకొని ఆదాయం పొందుతున్నారు. సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ను తీసుకువచ్చి లక్షల్లో గడిస్తున్నారు. అయితే, వారంతా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖల చేయాలా? వద్దా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీఆర్‌ను ఎలా ఫైల్‌ చేయాలనే విషయం మదిలో చాలానే ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఆదాయపు పన్ను అధికారులు, నిపుణుల ప్రకారం.. యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతున్న వారు తప్పనిసరిగా ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయాల్సిందే. ప్రధానంగా […]

  • Publish Date - July 27, 2023 / 06:24 AM IST

YouTube Income |

ప్రస్తుతం చాలా మంది యూట్యూబ్‌ను ఆధారంగా చేసుకొని ఆదాయం పొందుతున్నారు. సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ను తీసుకువచ్చి లక్షల్లో గడిస్తున్నారు. అయితే, వారంతా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖల చేయాలా? వద్దా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీఆర్‌ను ఎలా ఫైల్‌ చేయాలనే విషయం మదిలో చాలానే ప్రశ్నలు తలెత్తుతుంటాయి.

ఆదాయపు పన్ను అధికారులు, నిపుణుల ప్రకారం.. యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతున్న వారు తప్పనిసరిగా ఐటీ రిటర్న్‌లను దాఖలు చేయాల్సిందే. ప్రధానంగా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న కంటెంట్‌, యూట్యూబ్ యాక్టివిటీ ద్వారా మీరు ఆర్జించే ఆదాయం ఆధారంగా రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

యూట్యూబ్ ద్వారా లభించే ఆదాయమే మీకు ప్రధానంగా ఆదాయ మార్గమై.. భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లయితే ఆ ఆదాయం వ్యాపార ఆదాయం కిందకు వస్తుంది. ఈ క్రమంలో వృత్తి, వ్యాపారాల ద్వారా లభించే ఆదాయం లేదంటే.. సంపాదన కేటగిరీలో ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. అలాకాకుండా మీకు ప్రధాన ఆదాయమార్గం వేరే ఉండి.. యూట్యూబ్ చానెల్‌ను హాబిగా కొనసాగిస్తూ ఆదాయాన్ని పొందుతితే ‘ఇతర మార్గాల ద్వారా వస్తున్న ఆదాయం కేటగిరిలో చూపిస్తూ పన్నును చెల్లించాలి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.

ఏ ఆదాయమో నిర్ధారించుకోవాలి..

యూట్యూబ్ ద్వారా ఆర్జిస్తున్న ఆదాయం.. ‘వృత్తి, వ్యాపారాల ద్వారా లభించే ఆదాయం.. సంపాదన’ పరిధిలోకి వస్తే దాన్ని వృత్తి ద్వారా లభిస్తున్న ఆదాయమా? లేదంటే.. వ్యాపారం ద్వారా లభిస్తున్న ఆదాయమా ? అనే విషయాన్ని ముందుగా మీరు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అయితే, మీరు అప్‌లోడ్‌ చేస్తున్న కంటెంట్‌ను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.

అప్‌లోడ్‌ చేస్తున్న వీడియోల్లోని కంటెంట్‌ను రూపొదించేందుకు ప్రత్యేకంగా ఏమైనా ప్రత్యేకంగా శిక్షణ అవసరమైనా? లేదంటే నిపుణులే ఆ కంటెంట్‌ను రూపొందించగలుగుతారని తేలినా ఆ ఆదాయం ‘వృత్తి ద్వారా లభించే ఆదాయం’ కేటగిరి కిందకు వస్తుంది. నైపుణ్యం, శిక్షణ అవసరం లేని కంటెంట్‌ ద్వారా ఆదాయం పొందితే అది వ్యాపారం ద్వారా లభిస్తున్న ఆదాయంకిందకు వస్తుంది. ఈ ఆదాయానికి సెక్షన్ 44 ఏడీ కింద పన్ను చెల్లించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Latest News