కారు సీటు కవర్‌లోకి పాము..కాటుతో ఆసుపత్రి పాలు

కారు డ్రైవింగ్ సీటు వెనుక కవర్‌లో ఉన్న సెల్ ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించిన మహిళను నాగు పాము కాటేసింది

విధాత : కారు డ్రైవింగ్ సీటు వెనుక కవర్‌లో ఉన్న సెల్ ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించిన మహిళను నాగు పాము కాటేసింది. హైద్రాబాద్‌లో నివసించే ఖలీల్‌, ఆఫ్రీన్ దంపతులు దసరా సెలవుల సందర్భంగా నాగర్‌ కర్నూల్ జిల్లా రాచాలపల్లికి తమ పిల్లలతో కలిసి కారులో వెళ్లారు. తిరిగి మంగళవారం అర్ధరాత్రి సమయంలో అక్కడి నుంచి బయలుదేరి హైద్రాబాద్‌కు చేరుకున్నారు.


ఇంటికి చేరుకోగానే కారు సీటు కవర్‌లో పెట్టిన తన సెల్‌ఫోన్‌ను తీసుకునేందుకు ఆఫ్రీన్ చేయి పెట్టగా సెల్‌ఫోన్ స్థానంలో నాగుపాము చేతికి వచ్చింది. భయంతో పామును విదిలించగా ఆమె బొటనవేలిపై కాటేసింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. కారు సీటులోకి పాము ఎలా వచ్చిందన్నది మిస్టరీగా మారింది. అయితే స్థానికులు కారులోని నాగుపామును బయటకు తీసి చంపేశారు.

Latest News