బ్రేకింగ్‌: ఎస్టీల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు.. సీఎం కేసీఆర్ ద‌స‌రా కానుక‌

విధాత: ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర్ రావు రాష్ట్రంలోని గిరిజ‌నుల‌కు శుభ‌వార్త వినిపించారు. వారికి ద‌స‌రా కానుక‌ను అందించారు. జ‌నాభా దామాషా ప్ర‌కారం ఎస్టీల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. విద్య‌, ఉద్యోగ రంగాల్లో గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్ల‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ కేసీఆర్ అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ రిజర్వేష‌న్‌ల‌కు సంబంధించిన జీవో నంబ‌ర్ 33ను రాష్ట్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం అర్ధ‌రాత్రి జారీ చేసింది. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచుతామ‌ని కేసీఆర్ గ‌తంలో […]

  • Publish Date - October 1, 2022 / 12:04 AM IST

విధాత: ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర్ రావు రాష్ట్రంలోని గిరిజ‌నుల‌కు శుభ‌వార్త వినిపించారు. వారికి ద‌స‌రా కానుక‌ను అందించారు. జ‌నాభా దామాషా ప్ర‌కారం ఎస్టీల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. విద్య‌, ఉద్యోగ రంగాల్లో గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్ల‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ కేసీఆర్ అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ రిజర్వేష‌న్‌ల‌కు సంబంధించిన జీవో నంబ‌ర్ 33ను రాష్ట్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం అర్ధ‌రాత్రి జారీ చేసింది. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచుతామ‌ని కేసీఆర్ గ‌తంలో ఎన్నోసార్లు ప్ర‌క‌టించారు. సెప్టెంబ‌ర్ 17వ తేదీన ఆదివాసీ, బంజారా భ‌వ‌న్‌ల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా కూడా కేసీఆర్ ఎస్టీల రిజ‌ర్వేష‌న్ల‌పై స్పందిస్తూ.. వారంలోనే జీవో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇచ్చిన హామీ మేర‌కు కేసీఆర్ స‌ర్కార్.. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి జీవో జారీ చేసింది. ఈ జీవో అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానుంది.

టీఆర్‌ఎస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో సైతం గిరిజ‌న రిజ‌ర్వేష‌న్ల పెంపుపై హామీ ఇచ్చారు. రిజర్వేషన్ల పెంపు అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎస్‌ చెల్లప్ప నేతృత్వంలో కమిషన్‌ కూడా వేశారు. ఈ కమిషన్‌ ఇచ్చిన నివేదికను 2017లో ఏప్రిల్‌ 15న రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఆ తర్వాతి రోజే శాసనసభలో తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఏండ్లు గడిచినా కేంద్రం నాన్చివేత ధోరణి ప్రదర్శించటంతో స్వయంగా రిజర్వేషన్లు పెంచుతూ సీఎం సాహసోపేత నిర్ణయం తీసుకొన్నారు.

ఎస్టీల రిజ‌ర్వేష‌న్ల‌ను 6 నుంచి 10 శాతానికి పెంచ‌డంతో.. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు హోరెత్తాయి. త‌మ తండాలు, గూడెల్లో ఆదివాసీ, గిరిజ‌నులు ప‌టాకులు కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. కేసీఆర్ చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌కు రుణ‌ప‌డి ఉంటామ‌ని చెప్పారు. జ‌య‌హో కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Latest News