విధాత: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 382 పాయింట్లు దిగజారి 60,459 వద్ద నడుస్తున్నది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 17,744 వద్ద ట్రేడ్ అవుతున్నది.
అదానీ గ్రూప్ వ్యవహారం నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణ దిశగా నడుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత వారం కూడా స్టాక్స్ తీవ్ర ఒత్తిడిలోనే ట్రేడ్ అయిన విషయం తెలిసిందే.
ఇక అదానీ గ్రూప్‌లోని మెజారిటీ షేర్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ విలువ 3 శాతం మేర పడిపోయింది. హిండెన్ బర్గ్ రిపోర్టు నేపథ్యంలో గత వారం రోజుల ట్రేడింగ్ సెషన్లలో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్లదాకా హరించుకుపోయినది విదితమే.