విధాత: తెలంగాణలో వైఎస్ పాలన తిరిగి తీసుకొచ్చే వరకు తమ పోరాటం ఆగదని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎల్లుండి నుంచి డిసెంబర్ 14 వరకు పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామని చెప్పారు.
డీజీపీ కార్యాలయంలో డీజీ జితేందర్‌ను కలిసిన షర్మిల మీడియాతో మాట్లాడుతూ… పాదయాత్ర కొనసాగించేందుకు కోర్టు ఇచ్చిన ఆదేశాలను అందించారు. తన పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరారు. టీఆర్‌ఎస్ నాయకులు ఎక్కడ తమ పాదయాత్రను అడ్డుకున్నారో అక్కడి నుంచే పాదయాత్ర కొనసాగిస్తామన్నారు.
ప్రజాప్రస్థానం పాదయాత్రకు భద్రత కల్పించాలని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. రాజకీయ కుట్రలో భాగంగానే కేసీఆర్ నన్ను అరెస్ట్ చేయించారు. కేసీఆర్ ఎన్ని కుతంత్రాలు చేసినా YSR తెలంగాణ పార్టీని ఆపలేరు. pic.twitter.com/sm7gDCTYyp
— YS Sharmila (@realyssharmila) December 2, 2022
మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. పాదయాత్ర మాత్రం ఆగేది లేదని సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్ నేతల బెదిరింపులకు భయపడేది లేదన్నారు. పాదయాత్ర కాదు.. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని ఆపడం ఎవరి వల్ల కాదన్నారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఉదయించే సూర్యుడని, మీరు చెయ్యి పెడితే ఆగేది కాదని షర్మిల తెలిపారు.