విధాత,మెదక్ బ్యూరో: భార్యాభర్తల మధ్య గొడవలతో విసుగు చెందిన ఓ వ్యక్తి తప్పతాగి ఆత్మహత్యా యత్నం చేసుకోగా పోలీసులు, స్థానికులు కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి.
చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన కొమురయ్య అతని భార్యతో తరచూ గొడువలు పడుతున్నాడు. గొడవ లతో విసుగు చెందిన కొమరయ్య తప్పతాగి ఆ మైకంలో ముస్తాబాద్ చౌరస్తాలోని ఒక హోర్డింగ్‌కు ఉరేసుకొని అత్మహత్యకు యత్నించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో కొమురయ్యను హోర్డింగ్ పై నుంచి కిందకు దింపి కాపాడారు. గతంలో కూడా కొమరయ్య ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.