Site icon vidhaatha

Super Star Krishna | సూప‌ర్ స్టార్ కృష్ణ టాప్ 50 సాంగ్స్ ఇవే..

Super Star Krishna | టాలీవుడ్‌కు సూపర్ స్టార్‌గా.. అభిమానుల గుండెల్లో ఎవర్‌గ్రీన్ స్టార్‌గా ఉన్న కృష్ట ఘట్టమనేని క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లినప్ప‌టికీ ఆయ‌న‌ పాటలు మాత్రం స‌జీవంగానే ఉన్నాయి. తెలుగు ప్ర‌జ‌ల మెద‌డుల్లో మెదులుతూనే ఉంటాయి.. హృద‌యాల్లో మోగుతూనే ఉంటాయి. నేనొక ప్రేమ పిపాసిని, త‌న‌వి తీర లేదే, నా పేరు బికారి, తెలుగు వీర లేవ‌రా, పెళ్లంటే నూరేళ్ల వంటి పాట‌లు రికార్డు సృష్టించాయి.

టాలీవుడ్ మొట్టమొదటి కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో.. ప్రయోగాలకు మారుపేరు.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా సూప‌ర్ స్టార్ కృష్ణ నిలిచారు. సాంకేతికంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లిన మ‌హానుభావుడు ఈ సూప‌ర్ స్టార్. ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలతో టాప్ హీరోగా నిలిచారు.

తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ మూవీ ‘గూఢచారి 116’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో కృష్ణ హీరోగా నిలదొక్కుకున్నారు. ‘మోసగాళ్ళకు మోసగాడు’ మూవీతో తెలుగు సినిమాకు కౌబాయ్‌ను పరిచయం చేశారు. తొలి ఫుల్‌స్కోప్ సినిమా ‘అల్లూరి సీతారామరాజు’తో చరిత్ర సృష్టించారు.

తెలుగు ప్రేక్షకులకు అల్లూరి పేరు చెప్పగానే.. ఠక్కున గుర్తొచ్చే రూపం కృష్ణదే. అంతలా జీవించి.. ఆ పాత్రకు ప్రాణం పోశారు ఆయన. అంతేకాకుండా తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’, ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘పాడిపంటలు’, ‘ఈనాడు’, ‘అగ్నిపర్వతం’ వంటి ఎన్నో హిట్ చిత్రాలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు.

Exit mobile version