Site icon vidhaatha

హీరో కృష్ణ లెజెండ్ న‌టుడు.. కేటీఆర్ ట్వీట్

Super Star Krishna | టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణ మృతి ప‌ట్ల సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళుల‌ర్పిస్తున్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నారు.

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా నివాళుల‌ర్పించారు. ఇవాళ పొద్దున్నే ఓ విషాద‌క‌ర‌మైన వార్త‌తో నిద్ర లేచాన‌ని పేర్కొన్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ నిజ‌మైన లెజెండ్ న‌టుడు అని కొనియాడారు. టాలీవుడ్‌లో చాలా మ‌ర్యాద‌పూర్వ‌క న‌టుడు అని కేటీఆర్ ప్ర‌శంసించారు. ఈ విషాద‌క‌ర స‌మ‌యంలో కృష్ణ మ‌ర‌ణం ప‌ట్ల ఆయ‌న కుమారుడు హీరో మ‌హేశ్‌కు హృద‌యపూర్వ‌క సానుభూతి తెలుపుతున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. నెల‌ల వ్య‌వ‌ధిలోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోవ‌డం విషాద‌క‌ర‌మే అని మ‌హేశ్‌ను ఉద్దేశిస్తూ మంత్రి ట్వీట్ చేశారు.

Exit mobile version