Mahesh Babu- Rajamouli | సినిమా ఈజ్ డెడ్.. దారుణంగా కొట్టుకున్న మ‌హేశ్ బాబు, రాజ‌మౌళి

ఏఐ వీడియో (AI-generated Video) ఒక‌టి ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అందులో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి (SS Rajamouli), టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu) ఫైటింగ్ చేసుకుంటున్నారు.

AI-generated Video

Mahesh Babu- Rajamouli | అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence) అద్భుతాలు అన్నీఇన్నీ కావు. నేటి తరం టెక్‌ ప్రపంచంలో విపరీతంగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI). ఇప్పుడు ఇదే స‌ర్వాంత‌ర్యామి అయిపోయింది. ప్ర‌తీ ఒక్క‌రు దీన్ని ఉప‌యోగించి వింత‌లు వినోదాల‌ను సృష్టిస్తున్నారు. ఉన్న‌ది లేన‌ట్లు, లేనిది ఉన్న‌ట్లు క్రియేట్ చేస్తూ సోష‌ల్‌మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఏఐ వీడియో (AI-generated Video) ఒక‌టి ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడిగా పేరుగాంచిన రామ్‌గోపాల్ వ‌ర్మ తాజాగా ఓ వీడియోని పోస్టు చేశారు. అందులో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి (SS Rajamouli), టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu) ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఇద్ద‌రూ బ‌ద్ధ శ‌త్రువుల్లా కొట్టుకున్నారు. ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని, తోసుకుంటూ గొడవ పడుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాని ఊపేస్తోంది. ఇదేంటి ఇలా కొట్టుకుంటున్నారు అంటూ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

అస‌లు విష‌యం ఏంటంటే.. అది ఏఐ ద్వారా రూపొందించిన వీడియో. ఆ వీడియో చూసిన ఎవ‌రికైనా స‌రే నిజంగానే ఇద్దరి మధ్య గొడవ జరిగిందా అని భ్రమపడేలా ఆ వీడియో ఉంది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘సినిమా ఈజ్ డెడ్’’ (Cinema is dead) అంటూ వర్మ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చారు. భవిష్యత్తులో షూటింగ్స్ అవసరం లేకుండానే ఏఐతో సినిమాలు తీసేయొచ్చన్న‌ది ఆయ‌న ఉద్దేశం. ఈ వీడియో ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజ‌న్లు త‌మ‌దైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ రిలీజ్‌పై ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకుంది అంటూ ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, వార‌ణాసి సినిమాని దుర్గ ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై డా.కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ ఇందులో భాగస్వాములు కావడం విశేషం. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి :

Rashmika-Vijay Wedding | విజ‌య్‌తో పెళ్లి.. రష్మి‍కకు రౌడీబాయ్‌ పేరెంట్స్ పెట్టిన కండిష‌న్స్‌ ఏంటో తెలుసా..?
Devji surrendered | లాంఛనంగా లొంగిపోయిన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, దామోదర్‌, గంగన్న.. మీడియా సమావేశంలో ప్రవేశపెట్టిన డీజీజీ

Latest News