Tollywood | 2026 టాలీవుడ్ బాక్సాఫీస్ హీట్‌… మ‌హేష్ బాబు, బ‌న్నీ అభిమానుల‌కి ఎదురు చూపులు త‌ప్ప‌వా?

Tollywood | 2026 సంవత్సరం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సందడి ఒక రేంజ్‌లో ఉండబోతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే భారీ సినిమాల హడావుడి కనిపించగా, సమ్మర్ సీజన్‌కు రేస్ మరింత ఆసక్తికరంగా మారనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిని గ్రాండ్‌గా ప్రారంభించగా, ఇక రాబోయే నెలల్లో అగ్ర హీరోలందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Tollywood | 2026 సంవత్సరం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సందడి ఒక రేంజ్‌లో ఉండబోతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే భారీ సినిమాల హడావుడి కనిపించగా, సమ్మర్ సీజన్‌కు రేస్ మరింత ఆసక్తికరంగా మారనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిని గ్రాండ్‌గా ప్రారంభించగా, ఇక రాబోయే నెలల్లో అగ్ర హీరోలందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటసింహం నందమూరి బాలకృష్ణ వంటి అగ్ర హీరోలందరూ ఈ ఏడాదే తమ చిత్రాలను విడుదల చేయనున్నారు. దీంతో 2026 బాక్సాఫీస్ పోటీ గట్టిగానే ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే ఈ హీట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం కనిపించరనే విషయం అభిమానులకు కొంత నిరాశ కలిగిస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి లో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, 2027 వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుండటంతో మరింత సమయం తీసుకుంటోంది. ఇక అల్లు అర్జున్ – తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కూడా ఇప్పటివరకు సుమారు 30 శాతం మాత్రమే పూర్తి అయినట్లు సమాచారం. హైఎండ్ గ్రాఫిక్స్, భారీ సెట్స్, అంతర్జాతీయ టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ చిత్రం కూడా 2027 వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.

అదే సమయంలో బన్నీ ఈ ఏడాది మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా స్టార్ట్ చేయనున్నారు. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు. దీంతో 2026లో బన్నీకి రిలీజ్ లేకపోయినా, 2027లో మాత్రం వరుసగా రెండు సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు నేచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ వంటి మిగతా హీరోలందరూ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. మొత్తంగా చూస్తే 2026 టాలీవుడ్‌కు స్టార్ పవర్ ఉన్న సంవత్సరం కానున్నప్పటికీ… మహేష్, బన్నీ అభిమానులు మాత్రం తమ హీరోల సినిమాల కోసం ఇంకో ఏడాది ఓపిక పట్టాల్సిందే.

Latest News