Supritha |
అత్తగా, అక్కగా, తల్లిగా, వదినగా ఇలా సపోర్టింగ్ పాత్రలలో మెరిసిన అందాల నటి సురేఖా వాణి.ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించిన సురేఖా వాణి బ్రహ్మనందం లాంటీ కమెడీయన్స్ పక్కన నటిస్తూ చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల క్రితం తన భర్తని కోల్పొయిన సురేఖా వాణి ప్రస్తుతం తన కూతురితో కలిసి ఉంటుంది.
సోషల్ మీడియాలో తల్లి కూతుళ్లు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. నాలుగు పదుల వయసు దాటిపోయినా.. సురేఖా అందంలో తన కూతురుతో పోటీ పడుతూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పొట్టి దుస్తులలో అందాల ఆరబోత చేస్తూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత.
తల్లి కూతుళ్లు ఇద్దరు మితిమీరిన గ్లామర్ షో చేయడం వలన కొన్ని సార్లు ట్రోలింగ్ ఎదుర్కొంటారు. అయిన కూడా వీరిద్దరు తగ్గేదే లే అంటున్నారు.కొన్నిసార్లు వారి కామెంట్స్ కి సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం చూశాం. తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Young Sensation Supritha at her Best