లోక్ సభలో మరో 49మంది ఎంపీల సస్పెన్షన్‌

లోక్‌సభలో ఎంపీల సస్పెన్షన్‌ల పర్వం కొనసాగుతుంది. మంగళవారం మరో 49మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెన్షన్ చేశారు

  • Publish Date - December 19, 2023 / 09:14 AM IST
  • ఇప్పటిదాకా 141మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌


విధాత: లోక్‌సభలో ఎంపీల సస్పెన్షన్‌ల పర్వం కొనసాగుతుంది. మంగళవారం మరో 49మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెన్షన్ చేశారు. నిన్న 95మంది ఎంపీలను సస్పెండ్ చేయగా, ఇప్పటి దాకా 141మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. విపక్ష పార్టీల ఎంపీల సస్పెన్షలను నిరసిస్తూ విపక్షాల సభ్యులు పార్లమెంటు బయట గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.


లోక్‌సభలో అగంతకులు చొరబడి కలర్ స్మోక్ వదిలిన ఘటనపై, పార్లమెంటు భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన చేయాలన్న డిమాండ్‌తో లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం విపక్షాల సభ్యులపై సస్పెండ్ వేటు వేస్తుంది. లోక్‌సభ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.