ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గంటన్నర పాటు జరిగిన కేబినెట్‌ సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఎలా ఉండాలన్నదానిపై చర్చించారు

  • Publish Date - December 14, 2023 / 10:31 AM IST
  • గవర్నర్ ప్రసంగానికి ఆమోదం


విధాత : తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గంటన్నర పాటు జరిగిన కేబినెట్‌ సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఎలా ఉండాలన్నదానిపై చర్చించారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతా తొలి గవర్నర్ ప్రసంగం కావడంతో గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు ఇవ్వాల్సిన సందేశంపై చర్చించి, గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఆర్థిక స్థితిగతులు, రానున్న రోజుల్లో పరిపాలన కొనసాగించే తీరుతెన్నులతో గవర్నర్ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది.


కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలలో భాగంగా ఆరు గ్యారంటీలలో ఇప్పటికే ప్రారంభించిన రెండు గ్యారంటీల పాటు మిగతా నాలుగు గ్యారంటీల అమలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.