Telangana | రాజకీయ వేడుకలు.. ఈ ‘దశాబ్ది’ ఉత్సవాలు

Telangana | నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ గోల్కొండ కోటలో కేంద్రం విధాత: ఎన్నికలు సమీపిస్తున్న వెళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు రాజకీయ వేడుకలుగా మారాయి. బీఆర్‌ఎస్‌ ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని 20 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో నిర్వహించాలని నిర్ణయించింది. అదే విధంగా ప్రభుత్వ పరంగా రాష్ట్ర, జిల్లా కేంద్రాలతో పాటు, డివిజన్‌, […]

  • Publish Date - June 1, 2023 / 01:21 AM IST

Telangana |

  • నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
  • రాజ్‌భవన్‌లో గవర్నర్‌
  • సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం
  • గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ
  • గోల్కొండ కోటలో కేంద్రం

విధాత: ఎన్నికలు సమీపిస్తున్న వెళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు రాజకీయ వేడుకలుగా మారాయి. బీఆర్‌ఎస్‌ ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని 20 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో నిర్వహించాలని నిర్ణయించింది.

అదే విధంగా ప్రభుత్వ పరంగా రాష్ట్ర, జిల్లా కేంద్రాలతో పాటు, డివిజన్‌, మండల కేంద్రాల్లో కూడా ప్రభుత్వ పరంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఉత్సవాలన్నింట్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొనేలా కో ఆర్డినేట్‌ చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇలా ఈ ఉత్సవాలను ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకున్నది. ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సచివాలయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శురవారం ఉదయం 10.30 గంటలకు జెండా ఆవిష్కరించనున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, డిజిగ్నిటరీ హోదా కలిగిన వారు జెండా ఆవిష్కరణ చేస్తారు.

రాష్ట్రంలో ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య విభేదాలున్న విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లోనే ప్రత్యేకంగా రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ కార్యాలయం ఏర్పాట్లు చేస్తున్నది. గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లోనే జెండా ఆవిష్కరిస్తారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్రం తరపున గోల్కొండ కోటలో ఉత్సవాల నిర్వహణ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆయనే స్వయంగా పరిశీలించారు.