Site icon vidhaatha

VOTERS | తెలంగాణ ఓటర్లు 3,06,42,333

VOTERS |

విధాత: రాష్ట్రంలో 3 కోట్ల పైచిలుకు ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఈ మేరకు ఓటర్ల ముసాయిదాను సోమవారం వెల్లడించింది. ఈ ముసాయిదాలో మొదటి సారిగా ఎన్‌ ఆర్‌ఐలకు ఓటు హక్కు కల్పించింది. రాష్ట్రంలో 2,742 మంది ఎన్‌ ఆర్‌ఐ ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు.

రాష్ట్రంలో 3,06,42,333 ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 1,53,73,066, మహిళలు 1,52,51,797 ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే సర్వీస్‌ ఓట్లర్లు15,337 మంది కాగా తొలిసారి ఓటు హక్కు పొందిన 18 నుంచి 19 ఏళ్ల యువతీ యువకులు 4,76,597 మంది ఉన్నట్లు వెల్లడించారు.

ముసాయిదా ఓటర్ల జాబితాను వెల్లడించిన ఎన్నికల సంఘం నేటి నుంచి సెప్టెంబర్‌ 19వ తేదీ వరకు అభ్యంతరాలనుస్వీకరిస్తామని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ ముగిసిన తరువాత అన్నింటిని పరిశీలించి తుది జాబితాను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు 35,356 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఈ ఏడాది జనవరి5వ తేదీన విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాకు అదనంగా 8,31,520 అడిషన్స్‌ వచ్చాయని, 1,82,183 ఓట్లు డిలిట్‌ చేశామన్నారు.

Exit mobile version