కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ వాయిదా వేసిన హైకోర్టు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దాఖలైన పిటిషన్‌ విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది

  • Publish Date - December 19, 2023 / 09:22 AM IST

విధాత : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దాఖలైన పిటిషన్‌ విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఘటపై సీఎస్ శాంతికుమారి నుంచి వివరాలు సేకరించి రెండు వారాల్లోగా ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించిన హైకోర్టు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.


మేడిగడ్డ బ్యారేజీ కుంగిన సమయంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు వెళ్లాయని, వచ్చిన ఫిర్యాదులను అనుసరించి రాష్ట్ర సీఎస్‌కు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి లేఖ రాసింది. సీఎస్ నుంచి సమాచారం తీసుకుని రెండు వారాల్లోపు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.