విధాత: ది హిందూ (THE HINDU) చైర్‌పర్సన్ మాలినీ పార్థసారథి తాను నిర్వహిస్తున్న బాధ్యతల నుంచి వైదొలిగారు. అధికార మార్పిడికి సంకేతంగా రాజదండాన్ని జవహర్‌లాల్ నెహ్రూకు మౌంట్‌బాటెన్ ఇచ్చారన్న అంశంపై హిందూ పాలక మండలిలో వివాదం తలెత్తిన విషయం విధితమే.
1947 ఆగస్టు 29న రాజదండాన్ని నెహ్రూకు అప్పగిస్తూ వచ్చిన వార్తను ఆయన అందరికీ అందించారు. ఆ వార్తా కథనంలో మౌంట్‌బాటెన్ లేక రాజగోపాలాచారి ప్రస్తావన లేక ప్రకటన ఎక్కడా లేదు. రాజదండం లేక సెంగోల్ ఒక ప్రైవేటు మఠం వారు కొత్త ప్రధాని నెహ్రూకు ఇచ్చిన కానుక మాత్రమేనని ఆ వార్త తెలియజేస్తుంది.
అందుకే దానిని నెహ్రూ ప్రయాగ్‌రాజ్‌లోని ఆనందభవన్ మ్యూజియంలో భద్ర పరిచారని, ప్రధానికి తాము కానుకగా ఇచ్చిన విషయాన్ని మఠం వారు హిందూలోనే ప్రకటన రూపంలో పేర్కొన్నారని ఎన్ రామ్ తెలిపారు.
ప్రకటన ప్రతిని పాత్రికేయులకు చూపారు. సెంగోల్‌ను మౌంట్‌బాటెన్.. నెహ్రూకు ఇచ్చారన్న వాదనను మాలినీ పార్థసారథి సమర్థించారు.
ఆర్‌ఎస్‌ఎస్ మేధావి గురుమూర్తి కూడా ఇదే వాదన చేశారు. ఎన్.రామ్ ఈ వాదన బోగస్ అని రుజువు చేస్తూ ఆధారాలు బట్టబయలు చేయడంతో మాలిని చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఎన్. రామ్, మాలిని తోబుట్టువులు అయినప్పటికీ భావాల పరంగా భిన్నధృవాలుగా ఉన్నారు