విశ్వంలోనే అత్యంత పెద్ద జ‌ల‌రాశి.. భూమిపై కాదు !

ఈ విశ్వంలోనే అత్యంత పెద్ద మొత్తంలో ఉన్న జ‌ల‌రాశిని శాస్త్రవేత్త‌లు క‌నుగొన్నారు. అయితే అది భూమిపై కాదు.. జ‌ల‌రాశి అంత‌రిక్షంలో ప‌రిభ్ర‌మిస్తోంద‌ని పేర్కొన్నారు

  • Publish Date - December 12, 2023 / 09:35 AM IST

విధాత‌: ఈ విశ్వం (Space) లోనే అత్యంత పెద్ద మొత్తంలో ఉన్న జ‌ల‌రాశిని శాస్త్రవేత్త‌లు క‌నుగొన్నారు. అయితే అది భూమిపై కాదు.. ఈ జ‌ల‌రాశి అంత‌రిక్షంలో ప‌రిభ్ర‌మిస్తోంద‌ని పేర్కొన్నారు. భూమిపై ఉన్న మొత్తం నీటి కంటే ట్రిలియ‌న్ రెట్ల పెద్ద మొత్తంలో జ‌ల‌రాశి అక్క‌డ ఉంద‌ని చెబుతున్నారు.


జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబ‌రేట‌రీలో ప‌నిచేసే శాస్త్రవేత్త మ‌ట్ బ్రాడ్‌ఫోర్డ్ క‌థ‌నం ప్ర‌కారం.. భూమికి 120 కోట్ల కి.మీ. దూరంలో ఉన్న క్వాస‌ర్ బ్లాక్‌హోల్ ఆవ‌ల ఈ నీరు ఉంది. దీనిని శ‌క్తివంత‌మైన టెలిస్కోప్‌ల‌తో మాత్ర‌మే చూడ‌గ‌ల‌మ‌ని ఆయ‌న అన్నారు.


ఇది ఉన్న ప్రాంతం అనేక యాక్టివ్ గెలాక్సీల‌కు నిల‌య‌మ‌ని.. నీటికి అవ‌స‌ర‌మైన వాయువులు ఎప్పుడూ వెద‌జ‌ల్ల‌బడుతూ ఉంటాయ‌ని తెలిపారు. క్వాస‌ర్ చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణం చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఇక్క‌డ పెద్ద ఎత్తున నీరు త‌యారుకావ‌డానికి అవ‌కాశం ఉంది అని బ్రాడ్‌ఫోర్డ్ వివ‌రించారు. భూమిపై జీవం పుట్ట‌క ముందే విశ్వంలో ఎక్క‌డో అక్క నీరు ఉంద‌నేందుకు ఇదో నిదర్శ‌న‌మ‌ని ఆయ‌న అన్నారు.


అయితే ఈ ఆవిష్క‌ర‌ణ శాస్త్రవేత్త‌ల‌ను ఏమీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌లేదు ఎందుకంటే విశ్వంలో ఏదో చోట నీరు ఉండ‌టం అనేక ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అయితే అది ఎక్కువ భాగం గ‌డ్డ క‌ట్టిన స్థితిలో ఉంది. ప్రస్తుతం శాస్త్రవేత్త‌లు చెబుతున్న క్వాస‌ర్ ను శాస్త్రవేత్త‌లు ఏపీఎం 08279+5255 అనే పేరుతో పిలుస్తున్నారు. ఇక్క‌డ ఉన్న బ్లాక్‌హోల్ సూర్యుని కంటే 20 రెట్ల ద్ర‌వ్య‌రాశిని క‌లిగి ఉండ‌ట‌మే కాకుండా 1000 ట్రిలియ‌న్ సూర్యుళ్లు విడుద‌ల చేసే శ‌క్తిని ఇస్తుంది.

Latest News